• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

స్కామ్‌ల ఎఫెక్ట్: చిన్న, మధ్య తరహా సంస్థల ‘రుణ’ బాధలు!

By Swetha Basvababu
|

న్యూఢిల్లీ: ఇటు భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థనూ, అటు కార్పొరేట్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నీరవ్ మోదీ, రొటొమాక్ కుంభకోణాలు కొత్త కష్టాలు తెచ్చిపెట్టాయి. బ్యాంకర్లను మోసగించడానికి నీరవ్ మోదీ, విక్రం కొఠారీ వంటి ప్రముఖులు అనుసరించిన వ్యూహాలు చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టాయి.

కొత్తగా రుణం కోసం ఆయా వ్యాపార సంస్థలు పెట్టిన దరఖాస్తులను బ్యాంకులు పున: పరిశీలించడంతోపాటు రుణాల పంపిణీ మరింత జాప్యం అవుతున్నది. ప్రత్యేకించి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రుణాల మంజూరీ ప్రక్రియను మరింత సునిశితంగా తనిఖీ చేశాక మరీ నిర్ణయం తీసుకుంటున్నాయి.

కార్పొరేట్లను ఆకర్షించేందుకు ప్రైవేట్ బ్యాంకర్ల ఫోకస్

కార్పొరేట్లను ఆకర్షించేందుకు ప్రైవేట్ బ్యాంకర్ల ఫోకస్

ప్రభుత్వ రంగ బ్యాంకులు, కార్పొరేట్ వ్యాపార సంస్థలకు మధ్య విశ్వాసం నశించింది. దీన్ని ప్రైవేట్ బ్యాంకులు ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. పలువురు ప్రభుత్వ బ్యాంకుల ఖాతాదారులను ఆకర్షించి తమ ఖాతాదారులుగా చేర్చుకునేందుకు అవసరమైన చర్యలన్నీ చేపడుతున్నాయి. కానీ రుణాల పంపిణీ ప్రక్రియ ఒక వివాదంగా మారుతున్నదని కార్పొరేట్ సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు ఆందోళన చెందుతున్నాయి.

సంస్థల కార్యకలాపాలపై రుణ మంజూరీ జాప్యం

సంస్థల కార్యకలాపాలపై రుణ మంజూరీ జాప్యం

రూ.120 కోట్ల వర్కింగ్ కేపిటల్ కోసం అవసరమైన రుణం మంజూరు కోసం గుజరాత్ కేంద్రంగా పని చేస్తున్న ఒక సంస్థ రెండు బ్యాంకులను ఆశ్రయించింది. కానీ తాజా కుంభకోణాలతో సదరు సంస్థకు రుణాల మంజూరులో ఆలస్యమవుతున్నది. కంపెనీల కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతుందని సదరు సంస్థ ఎగ్జిక్యూటివ్ ఆందోళన వ్యక్తం చేశారు.

నోట్ల రద్దు నుంచి బ్యాంకింగ్ వ్యవస్థ అస్తవ్యస్తం

నోట్ల రద్దు నుంచి బ్యాంకింగ్ వ్యవస్థ అస్తవ్యస్తం

ఆయా సంస్థల బ్యాలెన్స్ షీట్, ఆస్తుల్లో నిజానిజాలను బట్టి బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. నోట్ల రద్దు నుంచి బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని మధ్య తరహా సంస్థ సీఈఓ తెలిపారు. దీనికి తోడు కుంభకోణాల పర్వం కార్పొరేట్ ప్రపంచానికి తీరని శాపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. పీఎన్బీలో మోసం సాకుగా బ్యాంకర్లు కొత్త రుణాలను మంజూరు చేయడానికి నిరాకరిస్తున్నారు.

2013 నుంచి రుణాల మంజూరునకు సమస్యలు

2013 నుంచి రుణాల మంజూరునకు సమస్యలు

2013 నుంచి ఉత్పాదక సంస్థలు రుణాలు పొందడానికి పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ రుణాలు పొందినా వడ్డీరేట్లు అధికంగా ఉన్నాయి. ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువగా ఉన్నా రుణాలు పొందడం సంక్లిష్టంగా మారిందని కార్పొరేట్ సంస్థల సీఎఫ్ఓలు ఆందోళన చెందుతున్నారు. అధిక వడ్డీల కారణంగా రుణ వాయిదాల చెల్లింపులు కష్ట సాధ్యంగా మారిందని అంటున్నారు. ఈ సమస్య నుంచి బయటపడేలోగా కుంభకోణాలు బయటపడ్డాయని చెబుతున్నారు.

25 శాతం ఉద్యోగులను బదిలీ చేసిన పీఎన్బీ

25 శాతం ఉద్యోగులను బదిలీ చేసిన పీఎన్బీ

పీఎన్బీలో కుంభకోణం దరిమిలా ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ సామూహికంగా సిబ్బంది బదిలీలకు పూనుకున్నాయి. 2017 డిసెంబర్ నెలాఖరు నాటికి ఒకేచోట మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సిబ్బందిని బదిలీ చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో గతవారం బాధిత పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఎకాఎకీన 18 వేల మందిని బదిలీ చేసింది. మొత్తం బ్యాంక్ సిబ్బందిలో ఇది 25 శాతం అని చెబుతున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
While Nirav Modi and the Rotomac scams have shaken up the Indian banking system, the corporate in the country, at least the mid and small size companies, are feeling the pinch as the banks are not only re-verifying loan approvals but delaying disbursal. The public sector banks (PSUs) have suddenly increased the scrutiny.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more