సరికొత్త పథకాలతో మహిళలకు వరాలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బ్యాంకింగ్ మరియు ఆర్థిక రంగ సంస్థలు మహిళల కోసం అదిరిపోయే ఆఫర్లను ప్రకటించాయి. మహిళల ఆర్థిక ఎదుగుదల, ఆరోగ్యం మరియు వ్యాపార కలలను ప్రోత్సహించేలా యెస్ బ్యాంక్ (Yes Bank), ఎస్‌బీఐ (SBI), మరియు ఎల్‌అండ్ టీ ఫైనాన్స్ (L&T Finance) సరికొత్త పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఆ వివరాలు మీకోసం:
ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన యెస్ బ్యాంక్ మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా 'యెస్ ఎసెన్స్ ఉమెన్స్ శాలరీ అకౌంట్'ను ప్రవేశపెట్టింది. వారి జీవనశైలికి తగ్గట్టుగా రూపొందించిన ఈ ఖాతా ద్వారా మొదటి ఏడాది ఉచిత లాకర్ సౌకర్యం లభిస్తుంది. అంతేకాకుండా, మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ రూ.5 లక్షల వరకు ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ మరియు ఏడాదికి ఒకసారి ఉచిత హెల్త్ చెకప్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ ఖాతాతో పాటు ఇచ్చే 'ఎలిగెన్స్ డెబిట్ కార్డ్' ద్వారా షాపింగ్ చేసే వారు ఏడాదికి రూ.6,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉండటం విశేషం.

మహిళా సాధికారతకు ఎస్‌బీఐ..
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), మహిళల ఆర్థిక భరోసా కోసం ఏకంగా 500 మిలియన్ డాలర్ల (సుమారు రూ.4,590 కోట్లు) సామాజిక రుణ నిధిని ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన లింగ సమానత్వం మరియు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా ఈ నిధులను వెచ్చించనున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు, స్వయం ఉపాధి పొందే వారికి రుణ సాయం అందించడం ద్వారా సామాజిక మార్పు తీసుకురావడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఎస్‌బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి పేర్కొన్నారు.
ఎల్‌అండ్‌టీ 'స్ఫూర్తి'..
సొంత ఇల్లు లేదా వ్యాపార స్థలం కొనుగోలు చేయాలనుకునే మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఎల్‌అండ్ టీ ఫైనాన్స్ 'స్ఫూర్తి' అనే ప్రత్యేక గృహ రుణ పథకాన్ని ప్రారంభించింది. వ్యాపారంలో 50 శాతం వాటా ఉండి, ఏడాదికి కనీసం రూ.5 లక్షల లాభం పొందే మహిళలు ఈ రుణానికి అర్హులు. దీని ద్వారా తక్కువ వడ్డీకే రూ.75 లక్షల వరకు రుణం పొందవచ్చు. గృహ రుణాలకైతే 25 ఏళ్లు, వ్యాపార ఆస్తుల హామీతో తీసుకునే రుణాలకు 12 ఏళ్ల కాలపరిమితిని సంస్థ అందిస్తోంది. మహిళల ఆర్థిక స్వేచ్ఛకు ఈ పథకం ఒక గొప్ప ఊతాన్నిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications