అక్కడ ఏటీఎంలలో ఘుమఘుమలాడే బిర్యానీ!!

ఆలోచించాలి గాని ప్రతి మనిషికి వినూత్నమైన ఆలోచనలు ఎన్నో వస్తాయి. కాస్త మెదడుకు పదును పెట్టాలి కానీ బోలెడు ఆలోచనలు మన మస్తిష్కం నుండి జాలువారుతాయి. ఇక వ్యాపార దృక్పథంతో బిజినెస్ చేసేవారు కస్టమర్ కు ఏ విధంగా తమ సేవలను అందిస్తే సంతోషపడతారో ఆలోచించి చాలా ఇన్నోవేటివ్ గా వ్యాపారాలు చేస్తున్నారు.

ఫుడ్ ఇండస్ట్రీలో పెరిగిపోయిన సృజనాత్మకత

ఫుడ్ ఇండస్ట్రీలో పెరిగిపోయిన సృజనాత్మకత

ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో ఇటువంటి సృజనాత్మక ఆలోచనల బిజినెస్ లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ఫుడ్ ఇండస్ట్రీ దూసుకుపోతుంది. ఇప్పటికే హోటల్స్ కు వెళ్లి ఆర్డర్ ఇచ్చి భోజనం తెచ్చే వరకు వెయిట్ చేసి తినే బదులు, మొబైల్ హోటల్స్ లో వెంటనే ఆహారాన్ని అందించే వెసులుబాటును, టేక్ అవే వెసులుబాటును కల్పించడంతో వాటిని సైతం ఆదరిస్తున్నారు. ఇక హోటల్స్ లో నిరీక్షణకు గుడ్ బై చెప్తూ టేక్ అవే, హోమ్ డెలివరీలు అందించే హోటల్స్ సైతం విపరీతంగా పెరిగాయి. ఇక జొమాటో, స్విగ్గి లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ఫుడ్ ఇండస్ట్రీకి కొత్త ఊతం ఇస్తున్నాయి.

 చెన్నై స్టార్టప్ కంపెనీ బిర్యానీ ఏటీఎంలు

చెన్నై స్టార్టప్ కంపెనీ బిర్యానీ ఏటీఎంలు

ఇక ఇదే క్రమంలో కొత్తగా ఇన్నోవేటివ్ ఆలోచనలతో బిర్యానిని విక్రయించాలి అనుకున్న ఒక సంస్థ నిర్వాహకులు బిర్యానీ ఏటీఎం లను ప్రారంభించారు. చెన్నై కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ బిర్యానీ ఏటీఎం ల పేరుతో వినూత్న ఆలోచనతో బిర్యానీ విక్రయాలకు ఓ కొత్త విధానాన్ని రూపొందించింది. కొలత్తూరులో బిర్యానీ ఏటీఎంలను ప్రారంభించి, ఎటువంటి మానవ వనరుల సహాయం లేకుండా బిర్యానీ విక్రయాలు సాగిస్తుంది.

అంతా ఏటీఎం లోనే.. నిముషాల్లో బిర్యానీ మీ చేతికి

అంతా ఏటీఎం లోనే.. నిముషాల్లో బిర్యానీ మీ చేతికి

బిర్యానీ ఏటీఎంలో మెనూలో కావలసినవి ఎంచుకొని మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, మనకు కావలసిన బిర్యానీని ఆర్డర్ చేసి, అందుకు చెల్లించవలసిన డబ్బులను ఆన్లైన్లో చెల్లిస్తే, మనకు ఫుడ్ ఎంత సేపట్లో వస్తుందో అందులో టైం చూపిస్తుంది. ఇక ఆ సమయానికి ఏటీఎంలో డబ్బులు ఏవిధంగా అయితే బయటకు వస్తాయో అదేవిధంగా డోర్ ఓపెన్ అయ్యి బిర్యానీ బయటకు వస్తుంది.

చెన్నై కొలత్తూరులో మానవ రహిత బిర్యానీ ఏటీఎంలు

చెన్నై కొలత్తూరులో మానవ రహిత బిర్యానీ ఏటీఎంలు

బాయ్ వీటూ కళ్యాణం పేరుతో మొట్టమొదటి మానవ రహిత బిర్యానీ ఏటీఎంలను ప్రారంభించిన సదరు స్టార్టప్ కంపెనీ తక్కువ సమయంలో ఏటీఎంల ద్వారా కస్టమర్లకు సేవలను అందిస్తుంది. ఇక ఈ కొత్త ఆలోచనను చాలామంది స్వాగతిస్తున్నారు. చాలామంది బిర్యాని ప్రియులు ఈ ఏటీఎంలో బిర్యాని కొనుగోలు చేసుకుంటూ తింటున్నారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోని కొలత్తూరులో ఏర్పాటు చేసిన ఈ బిర్యాని ఏటీఎం సక్సెస్ అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి ఏటీఎంలను ఏర్పాటు చేయడానికి సదరు సంస్థ ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+