morphing: భర్తలు చనిపోయిన లేడీస్ టార్గెట్, ఏమి అడుగుతున్నారంటే ?, ఆ ఫోటోలు ఫ్రెండ్స్ కు షేర్!

చెన్నై/ సేలం: ఓ యువతి భర్త ఇటీవల చనిపోయాడు. భర్త చనిపోయాడని బాధలో ఉన్న యువతి మొబైల్ ఫోన్ కు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడారు. యువతి వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. కొన్ని రోజులకు యువతి మొబైల్ ఫోన్ కు ఆమె ఫోటోతో మార్ఫింగ్ చేసిన అసభ్యకరంగా ఉన్న పోర్న్ ఫోటోలు వచ్చాయి.

ఆమె ముఖంతో ఉన్న పోర్న్ ఫోటోలు చూసిన యువతి షాక్ అయ్యింది. పోలీసులు రంగంలోకి దిగారు. భర్తలు చనిపోయిన విధవలను టార్గెట్ చేసుకుని వారిని బెదిరించి కామం తీర్చుకుంటున్న కామాంధులు పోలీసులకు చిక్కారు. నిందితుల స్కెచ్ తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు.

భర్త చనిపోయాడు

భర్త చనిపోయాడు

చెన్నై సిటీలోని విరుంబాక్కంలో నివాసం ఉంటున్న యువతి భర్త ఇటీవల చనిపోయాడు. యువతికి తక్కువ వయసు ఉండటంతో ఆమెకు దేవుడు అన్యాయం చేశాడని బంధువులు విచారం వ్యక్తం చేశారు. భర్త చనిపోయాడని బాధలో ఉన్న యువతి ఆ విషయం మరిచిపోవడానికి ప్రయత్నిస్తోంది. యువతిని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఓదార్చుతున్నారు.

ఫోన్ చేసి ఏమడిగారంటే?

ఫోన్ చేసి ఏమడిగారంటే?

భర్తను కోల్పోయిన యువతి మొబైల్ ఫోన్‌కు ఇద్దరు మగాళ్లు వేర్వేరు సమయాల్లో ఫోన్ చేసి ఆమెతో అసభ్యకరంగా మాట్లాడారు. యువతి వారిని తిట్టింది. ఇంకో సారి ఫోన్ లు చేసి అసభ్యంగా మాట్లాడితే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. వెబ్‌సైట్‌ల నుండి పోర్న్ ఫోటోలు డౌన్‌లోడ్ చేసిన నిందితులు ఆ యువతి ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఆమె మొబైల్ ఫోన్ కు షేర్ చేశారు.

హడలిపోయిన యువతి

హడలిపోయిన యువతి

షాక్‌కు గురైన యువతి విరుగంబాక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన విరుగంబాక్కం పోలీసులు సెల్‌ఫోన్ నంబర్‌ను పరిశీలించారు. తమిళనాడులోని సేలం జిల్లా ఓమలూరు సమీపంలోని పాపంపట్టి ప్రాంతానికి చెందిన మణికందన్, అతని స్నేహితుడు చెన్నై సిటీలోని టీ నగర్ లో నివాసం ఉంటున్న వరదరాజన్ మతి అలియాస్ మథియాలగన్ (35)లను అరెస్టు చేశారు.

ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్

ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్

మణికందన్ సాలిగ్రామం ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికుడిగా, అతని స్నేహితుడు మథియాలగన్ టీ నగర్ ప్రాంతంలోని బేకరీలో పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పోలీసుల విచారణలో పట్టుబడిన మణికందన్, వరదరాజన్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉన్నారని పోలీసులు చెప్పారు.

భర్తలు చనిపోయిన మహిళలు టార్గెట్

భర్తలు చనిపోయిన మహిళలు టార్గెట్

సోషల్ మీడియాలో భర్తలను కోల్పోయిన మహిళలను గుర్తించిన నిందితులు అసభ్యకరమైన సందేశాలు పంపుతూ నిత్యం లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్పారు. కొందరు వితంతువులు స్వయం ఉపాధి కోసం ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు సోషల్‌ నెట్‌వర్కింగ్‌ లో పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తున్నారని, అలాంటి వారిని మణికందన్, వరదరాజన్ టార్గెట్ చేశారని పోలీసులు అన్నారు. తరువాత మహిళల మొబైల్ నంబర్లు సేకరించి వారికి నిరంతరం అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తున్నారని, మహిళల ఫొటోలు తీసి మార్ఫింగ్ చేసి వారి పంపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పోలీసులు అన్నారు.

బ్లాక్ మెయిల్ చేసి కోరికలు తీర్చుకుంటున్నారు

బ్లాక్ మెయిల్ చేసి కోరికలు తీర్చుకుంటున్నారు

భర్తలను కోల్పోయిన యువతుల ఫోటోలు సేకరించి మణికందన్, వరదరాజన్ వాటిని మార్ఫింగ్ చేసి వారికి ఆ ఫొటోలు పంపించి మేము చెప్పినట్లు వినపోతే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించడంతో పాటు వారిని అక్రమ కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నారని, ఎదురు తిరిగితే వారి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో భయాందోళనకు గురైన కొందరు యువతులను ఇంకా బెదిరించిన మణికందన్, వరదరాజన్ మా కోరిక తీర్చాలంటూ వారిద్దరూ బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసుల విచారలో వెలుగు చూసింది.

దెబ్బకు దిమ్మతిరిగిపోయింది

దెబ్బకు దిమ్మతిరిగిపోయింది

మణికందన్, వరదరాజన్ ఇద్దరూ తమ స్నేహితులు క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్‌కు అడ్మిన్‌లని పోలీసులు చెప్పారు, వీరి గ్రూప్ లో చిత్తూరు, తిరుపతి ప్రాంతాలకు చెందిన స్నేహితులు ఉన్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధిత మహిళల మొబైల్ నంబర్‌లను వారి స్నేహితులకు వాట్సాప్‌లో షేర్ చేసి డబ్బు తీసుకుంటున్నారని పోలీసుల విచారణలో షాకింగ్ సమాచారం బయటకు వచ్చింది. స్నేహితుల కోరికలు తీర్చడానికి నిరాకరించిన అమ్మాయిల ఫొటోలు, వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో పెట్టిన మణికందన్, వరదరాజన్ బెదిరింపులకు గురిచేస్తున్నారని చెన్నై సిటీ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+