చంద్రబాబు పుట్టిన రోజు : వీరుడు, శూరుడు అని రోజా పొగడ్తల వీడియో, బాబుకు విషెస్ చెప్పిన వైఎస్ జగన్
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం ఈ రోజు . టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఇప్పటికే పలువురు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. టిడిపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలుగు ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో పాటుగా 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువకుడు అని చంద్రబాబును కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘకాలం సీఎంగా పని చేశారని పేర్కొన్నారు. నలభై సంవత్సరాలుగా కష్టాన్ని శ్రమను నమ్ముకున్న వ్యక్తి చంద్రబాబు అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు .

నాడు చంద్రబాబు నాయుడును ఆకాశానికి ఎత్తుతూ రోజా మాటల వీడియో
ఇక ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న పలువురు టిడిపి నాయకులు చంద్రబాబు జన్మదినం సందర్భంగా రోజా మాట్లాడిన ఒక వీడియోను వైరల్ చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే రోజా నాడు చంద్రబాబు నాయుడును ఆకాశానికి ఎత్తుతూ మాట్లాడిన మాటలను నేడు చంద్రబాబు జన్మదినం సందర్భంగా తెగ వైరల్ చేస్తున్నారు. అందులో రోజా చంద్రబాబును వీరుడు , శూరుడు , ధీరుడు అంటూ ఓ రేంజ్ లో ఆకాశానికెత్తేశారు.

స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, అపర రాజకీయ మేధా దురంధరుడు చంద్రబాబు అన్న రోజా
ఇక నాటి వీడియో లో రోజా మాట్లాడిన మాటలు వింటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. అంతగా రోజా చంద్రబాబు నాయుడు పై పొగడ్తల వర్షం కురిపించారు. ఆ వీడియోలో రోజా తెలుగు తల్లి అన్నపూర్ణ వరాల పట్టి, అమ్మణ్ణమ్మ కలల పంట , నందమూరి సింహ రాజకీయ వారసుడు , ఆడపడుచులకు ఆత్మీయ సోదరుడు, స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, అపర రాజకీయ మేధా దురంధరుడు అంటూ చాలా భారీ పదాలతో చంద్రబాబు నాయుడిని కీర్తించారు.

కీర్తి వెలుగుల చంద్రుడు, జగమంతా మెచ్చిన ఆంధ్రుడు .. బాబుకు రోజా కితాబు
తెలుగు సింహం, పేదల పాలిట పెన్నిధి, తెలుగు వారి ఆత్మాభిమానాన్ని ప్రపంచం నలుదిశలా వ్యాపింపజేసిన కీర్తి వెలుగుల చంద్రుడు, జగమంతా మెచ్చిన ఆంధ్రుడు , తెలుగు సామ్రాజ్య వీర శూర ధీర రాజకీయ చక్రవర్తి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మన ప్రియతమ నాయకుడు మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారు అంటూ రోజా మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీ లోకి వెళ్ళిన తర్వాత రోజా బాబుపై నిప్పులు చెరుగుతున్నారు.
రోజా పాత వీడియో వైరల్ .. బాబుకు విషెస్ చెప్పిన వైఎస్ జగన్
తాజాగా చంద్రబాబు నాయుడు పై ఏ చిన్న అవకాశం దొరికినా విరుచుకు పడుతున్న వేళ, గతంలో రోజా చంద్రబాబు నాయుడుని తెగ పొగుడుతూ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు పుట్టినరోజున వైరల్ గా మారడం గమనార్హం. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు కు శుభాకాంక్షలు తెలిపిన జగన్ ఆ దేవుని ఆశీస్సులతో నిండు ఆరోగ్యంతో మీరు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు .ఇక జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో జగన్ కు చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా తన కృతజ్ఞతలు తెలియజేశారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications