SOLAR ECLIPSE:నేడు సూర్య గ్రహణం, తెరచే కాళహస్తి, మరికొన్ని ఇతర ఆలయాలు
ఇవాళ సూర్యగ్రహణం.. ఆలయాలన్నీ మూసివేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాతే తెరుస్తారు. ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు సంప్రోక్షణ చేసి, ప్రదోష కాల పూజలు చేస్తారు. ఆ తర్వాతే ఆలయాలను తిరిగి తెరుస్తారు. ప్రజలు గ్రహణ సమయంలో ఊరికనే ఉండి.. ఆ తర్వాత స్నానాదికాలు చేసుకుంటారు. ముఖ్యంగా గర్బవతులు జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి. లేదంటే వారికి అవయవ లోపంతో పిల్లలు జన్మించే అవకాశం ఉంటుంది.

రాహు కేతు క్షేత్రం
శ్రీకాళహస్తి రాహు కేతు క్షేత్రం కావడంతో ఇక్కడ గ్రహణ సమయంలో కూడా పూజలు యాథావిధిగా జరుగుతాయి. భూమికి వెలుగు పంచే సూర్య, చంద్రులను రాహు కేతువు మింగివేయడాన్ని అశుభంగా భావిస్తారు. రాహు కేతువులు చెడు గ్రహాలు కావడం.. వాటి నుంచి వెలుబడే విష కిరణాలు ఆలయాలపై వ్యతిరేక ప్రభావం చూపిస్తాయి. కానీ కాళహస్తి మాత్రం.. రాహు కేతు క్షేత్రం కావడంతో ఇక్కడ ఆలయం తెరచి ఉంచుతారు.

కవచంపై 27 నక్షత్రాలు
కాళహస్తి శివలింగంపై ఉన్న కవచంలో 27 నక్షత్రాలు, 9 రాశులు ఉంటాయి. సౌర కుటుంబాన్ని ఈ కవచం కంట్రోల్ చేస్తోంది. కవచంలో అన్ని గ్రహాలు ఉండటంతో వాటిపై లయకారకుడు ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు. అందుకే గ్రహణ ప్రభావం ఆలయంపై పడదు. రాహు కేతు దోషం కలిగిన వారు గ్రహణ సమయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.

సంగమేశ్వర ఆలయం
కర్నూలు జిల్లాలో గల సంగమేశ్వర ఆలయం గ్రహణం వేళ కూడా తెరిచే ఉంటాయి. యథావిధిగా పూజలు చేస్తారు. శ్రీకాళహస్తి ఆలయంలో గ్రహణం వేళ ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. ఇక్కడి ధృవమూర్తులకు శాంతి అభిషేకాలు నిర్వహిస్తారు. సంగమేశ్వర ఆలయంలో సూర్య గ్రహణం రోజున అరుణ హోమం చేపడతారు.

తిరువరుప్పు క్షేత్రం, ఉజ్జయిని మహంకాళి ఆలయం
కేరళలోని తిరువరుప్పు క్షేత్రం, మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని మహంకాళి ఆలయంపై గ్రహణం ప్రభావం చూపదు. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో గ్రహణం వేళ ప్రధాన ద్వారాలు తెరిచే ఉంచుతారు. కానీ శివలింగాన్ని పరిస్థితుల్లోనూ తాకనివ్వరు. పూజ, అభిషేకాలను గ్రహణ వేళల్లో నిలిపివేస్తారు.












Click it and Unblock the Notifications