వామ్మో.. వీళ్లు మాములొళ్లు కాదు కదా.? టమోట లారీ దోపిడీ.. పల్టీలు కొట్టడంతో..

అప్పుడప్పుడు చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. దొంగలు కూడా కొత్త కొత్త దారులు ఎంచుకుంటున్నారు. పెద్ద వాహనంలో ఒక్కరే ఉన్నారో ఇక అంతే సంగతులు. చిత్తూరు జిల్లాలో అలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. లారీ డ్రైవర్‌ను దొంగలు బెదిరించారు. కత్తి చూపి.. లారీ నుంచి దింపేశారు. టమోట లోడ్ లారీ తీసుకొని బయల్దేరారు.

చిత్తూరు జిల్లా రొంపిచెర్లకి చెందిన వేణుగోపాల్ లారీలో టమోటా లోడుతో వెళుతున్నారు. పుంగనూరు మార్కెట్ నుంచి చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌కి బయల్దేరాడు. అయితే పలమనేరు రోడ్డులోని పెట్రోల్ బంకు వద్ద ఆర్టీవో అధికారులు అని ముగ్గురు దుండగులు లారీని అడ్డగించారు. కత్తులతో బెదిరించి టమోటా లోడుతో సహా లారీని తీసుకెళ్లారు. డ్రైవర్‌ని దించేసి లారీతో సహా అక్కడి నుంచి పరారయ్యారు.

tomato lorry overturns in chittoor..

వెంటనే వేణు పోలీసులకు సమాచారం అందించాడు. లారీతో సహా పరారైన దోపిడీ దొంగలు పారిపోయే క్రమంలో వేగంగా నడిపారు. దీంతో లారీ ప్రమాదానికి గురైంది. అతివేగంగా వెళ్లడంతో లారీ అదుపుతప్పి పల్టీలు కొట్టింది. లారీ ఆచూకీ కనుగొనే ప్రయత్నంలో పోలీసులకి టమోటా లోడు లారీ బోల్తా కొట్టిందని తెలిసింది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. లారీ మాత్రమే కనిపించడంతో వారు పరారయ్యారని తెలుసుకున్నారు. ఆ ముగ్గురు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Recommended Video

    Leopard In Hyderabad CCTV Footage, May Have Escaped To Chilkur Forest

    జిల్లాలో జరిగిన ఈ దొంగనతం చర్చానీయాంశమయ్యింది. విచిత్రంగా లారీ దొంగలించడం ఏంటీ అని చర్చ జరిగింది. వారు నిజంగా దొంగలేనా..? లేదా తెలిసిన వారి పని అని పోలీసులు ఆరా తీస్తున్నారు. కానీ టమోటలు మాత్రం నేలమట్టం అయ్యాయి. సరుకు నాశనమై.. లారీ రిపైర్ వచ్చింది డ్రైవర్ కమ్ ఓనర్ వేణుగోపాల్ వాపోయారు. తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+