ఫిబ్రవరి 29న సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభం.. కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా మృణాల్ ఠాకూర్..!
హైదరాబాద్: తెలుగు వారి వస్త్రాలయం అంటే గుర్తుకొచ్చేది సీఎంఆర్ షాపింగ్ మాల్. తాజాగా సీఎంఆర్ షాపింగ్ మాల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్‌ను ప్రకటించింది. మృణాల్ ఠాకూర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని సీఎంఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం పేర్కొంది. సీఎంఆర్ షాపింగ్ మాల్-మృణాల్ ఠాకూర్ కలయిక ఒక మైలురాయి లాంటిదని యాజమాన్యం అభివర్ణించింది.ఎప్పటికప్పుడు ట్రెండ్‌లో ఉన్న ఫ్యాషన్ వేర్‌ను సీఎంఆర్ షాపింగ్ మాల్ తమ కస్టమర్లకు అందిస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.
పదహారణాల అచ్చ తెలుగు ఆడపడచులా కనిపించే మృణాల్ ఠాకూర్‌లో ఎంతో టాలెంట్ దాగి ఉంది. అందుకే సీఎంఆర్ షాపింగ్ మాల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం జరిగింది. సీఎంఆర్ షాపింగ్ మాల్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా మృణాల్ ఠాకూర్ చరిష్మా కస్టమర్ల నమ్మకాన్ని నిలబెడుతుందని యాజమాన్యం భావిస్తోంది. రొమాంటిక్ బ్లాక్ బస్టర్ సీతారామం చిత్రంలో అద్భుతమైన పాత్ర పోషించి తెలుగు రాష్ట్రాల్లో సీతా మహాలక్ష్మీగా మృణాల్ ఠాకూర్ గుర్తింపు పొందారు. తాజాగా సీఎంఆర్ బ్రాండ్ అంబాసిడర్‌గా మృణాల్ ఠాకూర్ కొత్త చరిత్ర సృష్టిస్తుందని యాజమాన్యం విశ్వాసం వ్యక్తం చేసింది.

ఇక సీఎంఆర్ షాపింగ్ మాల్ మరో గుడ్ న్యూస్‌ను ప్రకటించింది. 2024 ఫిబ్రవరి 29వ తేదీన సీఎంఆర్ షాపింగ్ మాల్ కొత్త బ్రాంచ్‌ను హయత్‌నగర్‌లో ప్రారంభిస్తోంది.. ఈ కొత్త షోరూంలో ఫ్యాషన్ ప్రియులకు తగ్గట్టుగా వస్త్రాలున్నాయి. ప్రత్యేక డిజైన్లు, వివిధ రకాల కలెక్షన్స్ తప్పకుండా ఆకట్టుకుంటాయి.
హయత్‌నగర్‌లోని సీఎంఆర్ షాపింగ్ మాల్ కొత్త వస్త్రాలయం ప్రారంభం సందర్భంగా ఈ ఈవెంట్‌ను మరింత కలర్‌ఫుల్‌గా మార్చేందుకు హీరోయిన్లు ఆశికా రంగనాథ్, అమృతా అయ్యర్‌లు కూడా వస్తున్నారు.వీరి చేతుల మీదుగా ఈ కొత్త వస్త్రాలయాన్ని ప్రారంభిస్తారు. సంక్రాంతి సందర్భంగా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన నాసామి రంగ చిత్రంలో ఆశికా రంగనాథ్ నటించగా.. హనుమాన్ చిత్రంలో అమృతా అయ్యర్ నటించారు.
సీఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రావాలని ఆహ్వానం పలుకుతోంది యాజమాన్యం.మోడ్రన్ ఫ్యాషన్ నుంచి ట్రెడిషనల్ వేర్ వరకు అన్నీ ఒకే చోట లభ్యమయ్యే సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చి మాల్ మొత్తం కలియతిరగండి. మర్చిపోకుండా 2024 ఫిబ్రవరి 29వ తేదీ గుర్తుంచుకోండి. ఈ అద్భుతమైన ప్రారంభోత్సవ వేడుకలో మీరూ భాగస్వాములు అవ్వండి. మీ అందరికీ సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రేమ పూర్వక ఆహ్వానం పలుకుతోంది.












Click it and Unblock the Notifications