DC vs RR : మరో విజయంపై డీసీ కన్ను..ఉనికి చాటుకొనేందుకు ఆర్ ఆర్ యత్నం..
ఐపీఎల్‌లో నేడు (బుధవారం) ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. రెండు జట్లలో డీసీ హాట్ ఫేవరేట్‌గా నిలుస్తోంది. కానీ చివరి క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఫలితాలు తారుమారు అవుతున్నాయి. ఇవాళ రాత్రి 7.30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగబోతోంది.
Recommended Video

డీసీ హవా..
ఈ సీజన్‌లో అన్నీ టీమ్స్ సగం మ్యాచులు ఆడేశాయి. ముంబై ఇండియన్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ మాత్రం అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. మిగిలిన జట్లు తర్వాతి స్థానంలో ఉన్నాయి. రన్ రేట్ ప్రకారం డీసీ రెండో స్థానంలో ఉంది. ఆర్ ఆర్ ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. డీసీ 7 మ్యాచులు ఆడగా.. 5 గెలిచింది. కేవంల్ 22 మ్యాచుల్లో మాత్రమే ఓడిపోయింది. ఆర్ ఆర్ మాత్రం 7 మ్యాచులు ఆడితే 3 మ్యాచుల్లో గెలిచి.. 4 మ్యాచుల్లో ఓడిపోయింది.

పటిష్టంగా అయ్యర్ టీం..
ఇక జట్లవారీగా చూస్తే ఢిల్లీ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో దూసుకెల్తోంది. అందుకే రెండో స్థానంలో నిలిచింది. ఇక ఆర్ ఆర్ కూడా మంచి ఫామ్‌లో ఉన్న ఆ జట్టుకు విజయాలు మాత్రం ఆశించిన మేర దక్కడం లేదు. విజయం కోసం స్టీవ్ స్మిత్ సేన జట్టుగా కష్టపడుతోన్న వారి జట్టుకు ఎక్కడో ఏదో నష్టం చేకూరుస్తోంది.

ఈ జట్లేనా..
మరో 7 మ్యాచుల్లో ప్రతిభ చాటిన జట్లు లీగ్ దశ నుంచి సెమీస్‌కు వెళతాయి. అందులో మాత్రం డీసీ, ముంబై, ఆర్సీబీ, కేకేఆర్ పక్కా అనిపిస్తోంది. కానీ మరో 6 నుంచి 7 మ్యాచులు ఉండటంతో.. ఏ మ్యాచ్ ఏ మలుపు తిప్పుతుందో చూడాలీ మరీ.












Click it and Unblock the Notifications