రూ.లక్షను రూ.9 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్
స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేటప్పుడు అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి. కంపెనీలు, వాటి పనితీరు, అవి సాధిస్తున్న విజయాలు, వాటి ఫలితాలు, ప్రకటనలు, పెట్టుబడి వ్యూహాలు.. ఇలా అన్నింటినీ తెలుసుకుంటుండాలి. అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహాలను కూడా తీసుకుంటుండాలి. అప్పుడే లాభాలను ఆశించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి మల్టీబ్యాగర్ స్టాక్ ఒకటి ఇన్వెస్ట్ చేసినోళ్లకు ఊహించని రిటర్న్స్ ఇచ్చింది.
మూడు సంవత్సరాల వ్యవధిలోనే దాదాపు 800 శాతం పెరిగి ఏకంగా లక్ష పెట్టుబడిని రూ. 9 లక్షలు చేసింది. ఈ షేర్ ఇంకా ట్రెండింగ్ లోనే కొనసాగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీన్ని వాచ్‌లిస్ట్‌లో యాడ్ చేసుకొని.. క్రమక్రమంగా పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. ఆ స్టాక్ ఏంటి? ఎంత లాభాలనిచ్చింది అనే విషయాలను తెలుసుకుందాం.

ఈ స్టాక్ పేరు డీ నోరా ఇండియా లిమిటెడ్ (De Nora India Limited). 1989లో పనిచేయడం ప్రారంభించింది. ఇటలీ కేంద్రంగా ఉన్న డీనోరా గ్రూప్ నకు ఇది అనుబంధ సంస్థ. కాథోడ్ అండ్ ఆనోడ్, ఎలక్ట్రో క్లోరినేటర్స్, కాథోడిక్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ తయారీ, అమ్మకాల విభాగంలో నిమగ్నమై ఉంది. తన వ్యాపారమంతా భారత్, ఆగ్నేయాసియా దేశాల్లోనే ఉన్నప్పటికీ తన సేవలను మిడిల్ ఈస్ట్‌కు కూడా విస్తరించింది.

2022-23 ఆర్థిక సంవత్సరం తన అమ్మకాల్లో మంచి పనితీరును కనబరిచింది. రూ.74 కోట్ల విలువైన అమ్మకాలు జరగ్గా ఆపరేటింగ్ ప్రాఫిట్ 8.7 (రూ.25 కోట్లు) శాతం పెరిగింది. క్రితం ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో కంపెనీ నికర లాభం 33.3 శాతానికిపైగా పెరిగి రూ. 20 కోట్లు అయింది. కంపెనీ ఆదాయం సంవత్సరం వ్యవధిలో 119 శాతానికి పైగా లాభాలనార్జించింది. మూడు సంవత్సరాల కాలంలో 755 శాతం పెరిగింది. కంపెనీ ROE, ROCE వరుసగా 22.1 శాతం, 29.6 శాతంగా నమోదయ్యాయి. గడిచిన 5 సంవత్సరాల కాలంలో కంపెనీ సేల్స్‌లో 22 శాతం వృద్ధిని కనపరిచింది. ప్రాఫిట్ గ్రోత్ రేట్ 63 శాతంగా ఉంది. ఈ స్టాక్ 4.85 శాతం పెరిగి రూ. 1797.15 వద్ద కొనసాగుతోంది. పెట్టుబడిదారులంతా ఈ షేర్ పై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications