IPL 2023 grand finale: జిల్ జిల్ జిగేల్: పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్

అహ్మదాబాద్: ఇంకో రెండు రోజులు. లక్షలాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఐపీఎల్ 2023 సీజన్‌ ఫైనల్ మ్యాచ్ ఆరంభం కాబోతోంది. ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ తొలి ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఈ జట్టు ఫైనల్స్ చేరడం ఇది పదోసారి. ఫైనల్స్‌లో ధోనీ సేనను ఢీ కొట్టే జట్టు ఏదనేది ఈ రాత్రికి తేలిపోతుంది.

ఇవ్వాళ రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జరగబోతోంది. గుజరాత్ టైటాన్స్- ముంబై ఇండియన్స్ మధ్య జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్ ఇది. గెలిచిన జట్టు ఫైనల్స్‌లో అడుగుపెడుతుంది. ఆదివారం సాయంత్రం ధోనీ సేనను ఢీ కొడుతుంది. ఫైనల్స్ చేరే గోల్డెన్ ఛాన్స్‌ ఏ జట్టుకు దక్కుతుందనేది ఉత్కంఠతగా మారింది. తొలి క్వాలిఫయర్‌లో ధోనీ సేన చేతిలో గుజరాత్ టైటాన్స్, ఎలిమినేటర్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ మట్టికరిచిన విషయం తెలిసిందే.

 stadium-

మంగళవారం రాత్రి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్‌ 1లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది చెన్నై సూపర్ కింగ్స్. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగా.. గుజరాత్ టైటాన్స్ దాన్ని ఛేదించలేకపోయింది. 157 పరుగులకు కుప్పకూలింది. 15 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది.

బుధవారం అదే స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయఢంకా మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. లక్నో సూపర్ జెయింట్స్ ఆ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. 101 పరుగులకే పెవిలియన్ చేరింది.

ఈ విజయం ఇచ్చిన ఊపుతో రెండో క్వాలిఫయర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను వారి సొంత గడ్డపై ఓడించడానికి సన్నద్ధమౌతోంది ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎగబడుతున్నారు. ఇవ్వాళ్టి రెండో క్వాలిఫయర్‌తో పాటు ఫైనల్ మ్యాచ్ టికెట్ల కోసం అహ్మదాబాద్ స్టేడియం వద్ద అభిమానులు బారులు తీరారు. ఎండ తీవ్రతను సైతం లెక్కచేయట్లేదు.

కాగా- ఐపీఎల్ 2023 క్లోజింగ్ సెరిమనీని గ్రాండ్‌గా నిర్వహించడానికి గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ర్యాప్ సింగర్ డివైన్, మ్యూజిక్ ఆర్టిస్ట్ కింగ్‌.. గ్రాండ్ ఫినాలెలో అదరగొట్టనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ అధికారికంగా ప్రకటించింది. వీరిద్దరూ గ్రాండ్ ఫినాలెలో ప్రదర్శన ఇవ్వనున్నట్లు తెలిపింది. సాయంత్రం 6 గంటలకు క్లోజింగ్ సెరిమనీ ఆరంభమౌతుంది. సుమారు గంట పాటు కొనసాగుతుంది.

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి గానీ- దీనిపై అధికారిక సమాచారం లేదు. లేజర్ అండ్ లైట్నింగ్ షోను ఏర్పాటు చేసింది. దీనికోసం స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, జియో సినిమా.. ఈ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+