• search
  • Live TV
తూర్పుగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గతేడాది రూ.2 వేల కోట్ల.. ఈ సారి దాటనున్న పందేలు.. రైడ్స్ కంటిన్యూ

|
Google Oneindia TeluguNews

సంక్రాంతి అంటే అచ్చ తెలుగు పండుగ.. కొత్త పంట, అల్లుళ్ల రాక.. డుడు బసవన్నల కోలాహలం... ఇక పందెం కోళ్లు క్రేజ్ మాములుగా ఉండదు. అవును కరోనా వల్ల గత రెండు, మూడేళ్ల నుంచి తగ్గింది.. కానీ లేదంటే మాములుగా ఉండేది కాదు. ఇప్పుడు మళ్లీ ఆ ఊపు వచ్చింది. అవును పాత కేంద్రాల వద్ద హడావిడి మాములుగా ఉండటం లేదు. కరోనా కేసులు వస్తోన్నా.. ఎవరూ వినిపించుకోవడం లేదు.

పందెం కోళ్లు

పందెం కోళ్లు

శిక్షణ శిబిరాల్లో రాటుదేలి.. సంక్రాంతికి పందేం కోళ్లు రెడీ అవుతున్నాయి. ఆంక్షలు ఉన్నా సరే తగ్గేదేలే అంటూ పందెం రాయుళ్లు రెడీ అయిపోయారు. కోర్టు ఆదేశాల ప్రకారం కోడి పందేలు నిర్వహించకూడదని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. పందేం కోళ్ళ పెంపకం దారులు, కోడి కత్తుల తయారీ దారులపై దాడులు జరిపి భారీ మొత్తంలో కోళ్ళను, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. పందెం రాయుళ్ళను పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. కోడి పందేల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తూనే వచ్చారు.

రైడ్

రైడ్

రోజూ ఎక్కడో ఒక చోట కోడి పందేల స్ధావరాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. పందెం రాయుళ్ళు పట్టుబడుతూనే ఉన్నారు. ఎలాగైనా పందెం కొట్టాలన్న కసితో పందెం నీదా.. నాదా అంటూ ఎంత ఖర్చుకైనా వెనకాడడం లేదు. కోడి పందేలు అంటేనే గోదావరి జిల్లాలు. ఇక్కడ పండుగ మూడు రోజులు పందెం బరులు తిరునాళ్లను తలపిస్తాయి. కోడి పందేలను వీక్షించేందుకు ఇతర రాష్ట్రాల నుంచే కాదు, దేశ విదేశాల నుంచి ఎన్నారైలు గోదావరి జిల్లాలకు తరలివస్తారు. పందేల్లో డబ్బు సంపాదించాలని కొందరు, తమ సత్తా చాటాలని మరికొందరు పుంజులను బరుల్లోకి దింపుతారు.

చేతులు మారనున్న కోట్ల రూపాయలు

చేతులు మారనున్న కోట్ల రూపాయలు

మూడు రోజుల పాటు జరిగే పందేల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. ఏపీ నుంచే గాకుండా తెలంగాణ నుంచి కూడా ఇప్పటికే పందెం రాయుళ్లు భారీగానే ఉభయ గోదావరి జిల్లాలకు చేరుకున్నట్టు తెలుస్తోంది.. సాంప్రదాయ క్రీడ పేరుతో కోడి పందేలను నిర్వహించడానికి మినీ స్టేడియాలను తలపించే విధంగా పందెం బరులను ఏర్పాటు చేస్తున్నారు. ఎల్ఈడి స్క్రీన్లు, ఫ్లడ్ లైట్ల వెలుగులో గుండాట, పేకాటలతో పందేలను రక్తి కట్టించడానికి భారీ ఏర్పాట్లు చేశారు. కోర్టు ఎన్ని ఆదేశాలు ఇచ్చినా, పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా ప్రతీ ఏటా ఈ ప్రాంతంలో కోడి పందేలు యధావిధిగా నిర్వహిస్తున్నారు.

గత ఏడాది రూ.2 వేల కోట్లు

గత ఏడాది రూ.2 వేల కోట్లు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్, కరప మండలాల్లో భారీగా పందెం బరులను ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల ఈ బరులు మినీ స్టేడియాలను తలపిస్తున్నాయి.. ఎల్‌ఈడి స్క్రీన్లపై కోడి పందేలను వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. వేలాది వాహనాలను పార్క్‌ చేసే విధంగా వందలాది ఎకరాల్లో పార్కింగ్ స్థలాలను కూడా సిద్ధం చేశారు. కోడి పందేల స్థావరాల సమీపంలో మద్యాన్ని పారించడానికి కూడా స్థానిక మద్యం వ్యాపారులు సిద్ధమవుతున్నారు. గతేడాది ఏడాది సంక్రాంతికి సుమారు 2 వేల కోట్లకు పైగా కోడి పందేలు జరిగాయని తెలుస్తోంది. ఈ సారి ఆ టార్గెట్ దాటుతుందేమోనని అంచనా వేస్తున్నారు.

English summary
sankranti kodi pandalu started godavari districts. last year 2 thousand crore bettings are done.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X