వావ్.. 10 వేల కేజీల స్వీట్లు.. మామకు తగ్గ అల్లుడు.. రిటర్న్ సారె ఇదీ

గోదావరి జిల్లాలు అంటేనే గౌరవం, మర్యాదలకు పెట్టింది పేరు. ఇటీవల ఓ కోడలు అత్తకు బర్త్ డే గిప్ట్.. తర్వాత మామ కోడలి బర్త్ డేకు గిప్ట్ చూశాం. అంతకుముందు సారెలు కూడా చూశాం. పలు రకాల సారెలు విన్నాం. ఆషాడ మాసం వెళ్లి శ్రావణ మాసం వచ్చింది. శ్రావణ మాస సారె కూడా ఉంటాయి. అలా తూర్పుగోదావరి జిల్లాలో నోరెళ్లబెట్టేవిధంగా సారె తయారు చేశారు.

సారె.. ఇలా

సారె.. ఇలా

ఆడపిల్లకు పుట్టింటి నుంచి సారె పంపడం ఆనవాయితీ. ఉభయగోదావరి జిల్లాల్లో ఆషాడం, శ్రావణం సారె కావిళ్లు ఇచ్చిపుచ్చుకోవడం పరిపాటి. గత నెలలో యానంలో అల్లుడికి మామ పంపిన ఆషాఢం సారె రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజు కుమారుడు పవన్ కుమార్‌కు.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన బత్తుల బలరామకృష్ణ కుమార్తె ప్రత్యూషతో ఇటీవలే వివాహం జరిగింది.

మామకు తగ్గ అల్లుడు

మామకు తగ్గ అల్లుడు

ఆషాఢమాసం సందర్భంగా మామ బత్తుల బలరామకృష్ణ.. అల్లుడు పవన్‌ కుమార్‌ ఇంటికి సారె కావిళ్ళను పంపించాడు. ఆ సారెను చూసి అల్లుడింటి వారితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అవాక్కయ్యారు. అల్లుడికి.. బలరామకృష్ణ ఏకంగా వెయ్యి కిలోల చొప్పున చెరువు చేపలు, పండు గొప్పలు, రొయ్యలు, 250 కిలోల బొమ్మిడాయిలు, 10 మేకపోతులు, 50 పందెం కోడి పుంజులు, వెయ్యి కిలోల కాయగూరలు, 250 కిలోల కిరాణా సామాగ్రి, 250 రకాల ఆవకాయ జాడీలు, 50 రకాల స్వీట్‌లు పంపించారు. అత్తింటివారి నుంచి వచ్చిన ఈ ఆషాఢం సారె కావిళ్ళు ఊరేగింపుగా పవన్‌ కుమార్‌ ఇంటికి తీసుకువచ్చారు. కనీవినీ ఎరుగని రీతిలో భారీగా వచ్చిన ఈ సారె కావిళ్లు అందర్ని ఆశ్చర్య పరచడమే కాక ఈ రెండు కుటుంబాల గురించి తెగ చర్చించారు.

మగ పెళ్లివారు ఇలా..

మగ పెళ్లివారు ఇలా..

ఇక ఆడపిల్లవారు అంత భారీగా సారే పంపిస్తే.. తాము ఎందుకు తగ్గాలి అనుకున్న మగపిల్లాడి తరుఫువారు శ్రావణ సారెలో భాగంగా ఏకంగా 10 వేల కేజీల స్వీట్లు కావిడి పంపించారు. వాటితోపాటు భారీ మొత్తంలో అరటి గెలలను కూడా పంపించారు. వీటన్నింటిని 5 వాహనాల్లో మామ బత్తుల బలరామకృష్ణ ఇంటికి పంపించాడు పవన్‌ కుమార్‌. వీరి సారె సందడి చూసిన జనాలు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుతున్నారు.

 150 వంటకాలు

150 వంటకాలు

అంతకుముందు మామ కోడలికి బర్త్ డే బహుమతి ఇచ్చారు భీమవరానికి చెందిన తుంపూడి వెంకటకృష్ణ.. 150 వంటకాలు ఏర్పాటు చేశారు. గోదావరి జిల్లాలు అంటే మర్యాద అని మరోసారి ప్రూవ్ చేశారు. కోడలు తేజస్విని పుట్టినరోజు సందర్భంగావంటకాలు చేయించారు. 14 రకాలు రైస్ ఐటెమ్స్ కాగా.. 35 రకాల స్వీట్లు ఉన్నాయి. 35 రకాల హాట్ కూడా ఉంది. చిన్న పెద్ద ఇష్టపడే 20 రకాల చాక్లెట్లు.. 20 రకాల కేకులు కూడా ఏర్పాటు చేశారు. ఆ వంటకాలతో టేబుల్ నిండిపోయింది. కలర్ పులే కాదు.. మంచి టేస్టీ ఉందని బంధువులు అంటున్నారు.

కోడలు గిప్ట్.. మామ బహుమతి

కోడలు గిప్ట్.. మామ బహుమతి

ఇదివరకు అత్తకు కోడలు గిప్ట్ ఇవ్వగా.. ఇప్పుడు మరో కుటుంబం ఇలాంటి మంచి పని చేసింది. కోడలు బర్త్ డే సందర్భంగా జీవితాంతం గుర్తుండే పనిచేసింది. 150 రకాల వంటకాలు చేసి.. ఔరా అనిపించింది. ఇదీ కోడలు అంటే తమ కూతురు అని.. సనాతన హిందు సంప్రదాయాన్ని తెలియజేసింది. మామ-అత్తను పలువురు నెటిజన్లు కొనియాడుతున్నారు. వావ్ అంటూ కీర్తిస్తున్నారు.

వావ్.. కోడలు

వావ్.. కోడలు


ఒకటి రెండు వంటకాలు చేయడం మహాకష్టం. అదీ కూడా అత్తకు చేయడం అంతా వీజీ కాదు. కానీ ఆమె 60 వంటకాలు చేసింది. అవున పులిహోర, బిర్యానీ, కర్డ్ రైస్, చల్లట్లు, అలు పరోటా, కొత్తిమీర చపాతీ, టొమాటో రైస్, సేమియా ఉప్మా, గారెలు, బంగాళదుంప బొండలు, ఇడ్లీ, అరటికాయ బజ్జీ, చల్ల పంగడలు, బ్రెడ్ శాండ్ విచ్ అలా 60 వంటకాలు చేశారు. ఆమె చేసిన వంటకాలు చూసి.. నోరూ ఊరుతుంది. స్వీట్, హాట్ కలిపి.. అత్తపై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు.

నిజంగా లక్కీయే..

నిజంగా లక్కీయే..

ఆ అత్త నిజంగా అదృష్టవంతురాలు. ఎందుకంటే తన పుట్టినరోజు సందర్భంగా కోడలు ఇచ్చిన బహుమతి మాములు కాదు. తినుబండారాలతో చేసి పెట్టిన ఐటెమ్స్ ప్రతీ ఒక్కరు మరవలేరు. లక్షలు, కోట్ల రూపాయల కన్నా కూడా ప్రత్యేకం. ఇష్టపడి చేసిన ఫుడ్ ఐటెమ్స్ ప్రతీ ఒక్కరీ మదిని దోస్తుంది. అవీ చేయడానికి ఎంత సమయం పట్టిందో తెలియదు.. కానీ అత్తపై తనకు ఉన్న మమకారాన్ని మాత్రం చాటుకున్నారు.

నలుగురికి ఆదర్శం

నలుగురికి ఆదర్శం

కోడలు అంటే ఇలా ఉండాలి.. అత్త అంటే అలా మెలగాలి అని అందరూ అంటున్నారు. వీడియో పోస్ట్ చేయగా.. నెట్టింట వైరల్ అయ్యింది. వావ్ అత్త కోడళ్లు అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మీరిద్దరూ మిగతావారికి ఆదర్శంగా నిలిచారని కామెంట్ చేస్తున్నారు. నిజానికి వీరిద్దరీ స్నేహం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం ప్రతీ ఒక్కరికీ వస్తే ఆ సమాజమే వసుదైక కుటుంబం అవుతుంది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు మామ వంతు వచ్చింది. కోడలు చేయంగా.. తాము ఏం తక్కువ తిన్నామా అనుకున్నారు. వారు 60 వంటకాలు పెడితే.. ఏకంగా 150 వెరైటీలు చేయించారు. మిగతా మామలకు ఆదర్శంగా నిలిచారు.

Recommended Video

    Rajahmandry Business Man Send Ashadham Saare In A Grand Style To His Daughter | Oneindia Telugu
    వేరుగా ఉండటమో.. ఇతర చోట్ల నివాసం

    వేరుగా ఉండటమో.. ఇతర చోట్ల నివాసం

    సాధారణంగా అత్త, మామలతో కొడుకులు/ కోడళ్లు సరిగా ఉండరు. పెళ్లయిన వెంటనే వేరు పడిపోవడమో.. లేదంటే ఇతర చోట ఉండటమో చేస్తారు. ఉమ్మడి కుటుంబాలు అనే మాటను మరచిపోయి చాలా రోజులు అవుతుంది. అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీలు ఏర్పడ్డాయి. సిటీలోనో.. టౌన్‌లోనే ఉంటున్నారు. పేరంట్స్‌ను పట్టించుకునే నాథుడే లేడు. సిటీ నుంచి కొందరు రావొచ్చు.. కానీ అమెరికా/ ఆస్ట్రేలియాలో ఉన్నవారి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చచ్చినా వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఊరిలో ఉన్న ముసలి ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నాయి. కానీ వారు సంపాదనలో పడిపోయారు. తమకు పేరంట్స్ వద్దనుకుంటున్నారు. కానీ రేపు వారి పరిస్థితి కూడా అదేనని విషయం మరచిపోతున్నారు. వర్తమానంలో జీవిస్తూ.. క్షణిక ఆనందం పొందుతున్నారు. రేపు తమ సిచుయేషన్ గురించి ఆలోచించడం లేదు. దీనికి సంబంధించి మూవీలో ఎన్ని చూపించినా.. మార్పు మాత్రం రావడం లేదు. డబ్బు సంపాదనకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+