ఎండ్ ఆఫ్ ద రోడ్: చెన్నై సూపర్ కింగ్స్‌కు మిస్టర్ ఐపీఎల్ రివర్స్ షాక్: ధోనీ సేన నుంచి బయటికి?
చెన్నై: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కొనసాగుతోన్న ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎపిసోడ్‌లో టైటిల్ హాట్ ఫేవరెట్ చెన్నై సూపర్ కింగ్స్ చవి చూసిన రెండు వరుస పరాజయాలు.. ఓ నిఖార్సయిన ఆల్‌రౌండర్ అవసరాన్ని ఎత్తి చూపాయి. బ్యాటింగ్, బౌలింగ్.. చివరికి ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపించగల సత్తా ఉన్న నాణ్యమైన ఆల్‌రౌండర్‌ను అర్జెంట్‌గా జట్టులోకి తీసుకోవాల్సి ఉంటుందనే సంకేతాలను పంపించాయి. ఈ పరిణామాలు- టోర్నమెంట్ ప్రారంభానికి ముందే జట్టుకు దూరమైన సురేష్ రైనా ఎంత విలువైన ఆటగాడో తెలిసేలా చేశాయి.

సురేష్ రైనాను పిలిపించబోమంటూ..
ఈ పరిస్థితుల్లో Come back Mr IPL అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా గళమెత్తిన వేళ.. టీమ్ మళ్లీ విజయాల బాట పట్టాలంటే సురేష్ రైనా వంటి ఆల్‌రౌండర్ అవసరం ఉందంట చెన్నై సూపర్ కింగ్స్ ఓ నిర్ణయానికి వచ్చిన సమయంలో..ఆయనను వెనక్కి పిలిపించే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదంటూ జట్టు ముఖ్య కార్యనిర్వహణాధికారి కాశీ విశ్వనాథన్ తేల్చి చెప్పారు. టోర్నమెంట్‌కు దూరంగా ఉండాలనేది సురేష్ రైనా వ్యక్తిగత నిర్ణయమని, దాన్ని తాము గౌరవిస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలు ఓ రకంగా సురేష్ రైనాకు షాక్ ఇచ్చినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయ

మరింత దూరం అయ్యేలా సంకేతాలు..
తనను మళ్లీ పిలిపిస్తారేమోననే ఆశలు ఏవైనా సురేష్ రైనాలో ఉండి ఉంటే.. కాశీ విశ్వనాథన్ చేసిన ప్రకటనతో అవి అడుగంటిపోయినట్టే. తనకు తానుగా రాజీపడితే తప్ప సురేష్ రైనాను ఎట్టి పరిస్థితుల్లోనూ జట్టులోకి ఆహ్వానించబోమని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేనేజ్‌మెంట్ పరోక్షంగా వెల్లడించినట్టయింది. కాశీ విశ్వనాథన్ ప్రకటన వెలువడిన తరువాత.. సురేష్ రైనా తీసుకున్న ఓ నిర్ణయం.. తీసుకున్న చర్యలు.. చెన్నై సూపర్ కింగ్స్‌తో తన బంధం ఇక తెగినట్టేనని, తాను జట్టుకు మరింత దూరం అవుతున్నానని, విషయాన్ని చెప్పకనే చెప్పినట్టయింది.

ట్విట్టర్ పేజీ నుంచి
చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక ట్విట్టర్ పేజీని సురేష్ రైనా అన్ ఫాలో చేశాడు. కాశీ విశ్వనాథన్ ప్రకటన వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన సీఎస్‌కే ట్విట్టర్ పేజీ నుంచి వైదొలిగాడు. అతని చర్యలు అనేక అనుమానాలకు తావిస్తోంది. టీమ్ మేనేజ్‌మెంట్-సురేష్ రైనా మధ్య ఓ మినీ ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోందా? లేక.. జట్టును వీడటానికి తాను సిద్ధంగా ఉన్నాననే సందేశాన్ని అతను పంపించాడా? అనేది చర్చనీయాంశమౌతోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అధికారిక ట్విట్టర్ పేజీని అన్ ఫాలో చేసిన సురేష్ రైనా.. తన స్నేహితుడు, స్కిప్పర్ మహేంద్ర సింగ్ ధోనీ మైక్రో బ్లాగింగ్‌లో కొనసాగుతున్నాడు.

సీఎస్‌కే నెక్స్ట్ మ్యాచ్‌లో ఏం చేస్తుందో?
చెన్నై సూపర్ కింగ్స్.. తన తరువాతి మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ మ్యాచ్ ఈ రెండు జట్లకూ ప్రతిష్ఠాత్మకమైనవే. ఈ రెండింట్లో ఏ టీమ్ ఓడిపోయినా.. దానికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. టోర్నమెంట్‌లో మరింత ముందుకెళ్లడానికి దారులు మూసుకుని పోవచ్చు. ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట్లో ఓటమిని చవి చూసింది చెన్నై సూపర్ కింగ్స్. రెండుకు రెండు మ్యాచుల్లోనూ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. శనివారం రాత్రి కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది.

రాయుడు రాక ఖాయం..
అక్టోబర్ 2వ తేదీన ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. బోణీ కొట్టాలనే ఉద్దేశంతో సన్ రైజర్స్ హైదరాబాద్.. వరుస పరాజయాలకు తెర దించాలనే కసి ధోనీ సేనలో కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌కు అంబటి రాయుడు అందుబాటులోకి రావడం దాదాపు ఖాయమైనట్టే. దీనితో- హైదరాబాద్‌తో పోల్చుకుంటే.. బ్యాటింగ్ లైనప్ చెన్నై సూపర్ కింగ్స్ బలంగా మారుతుంది. విజయం ఎవరిని వరిస్తుందనేది అత్యంత ఆసక్తిని రేపుతోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications