225 గజాలలో వ్యవసాయం.. ఈ బిజినెస్ ఐడియాతో నెలకు లక్షలు సంపాదిస్తున్నారు..
ఏదైనా వ్యాపారం చేయాలంటే పెట్టుబడి ఎంత ముఖ్యమో అందుకు తగిన స్థలం లేదా ప్రదేశం కూడా అంతే ముఖ్యం. కానీ ఏదైనా సాధించాలంటే పట్టుదలతో పాటు కాస్త ఆలోచన కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అయితే వ్యవసాయం చేయడానికి స్థలం లేదా మెటీరియల్ అవసరం లేదని హర్యానాకు చెందిన ఇద్దరు వ్యక్తులు నిరూపించారు. నవీన్, ప్రవీణ్ సింధు అనే ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లో చిన్న గదిలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మసాలా కుంకుమ పువ్వును పెంచి లక్షలు సంపాదిస్తున్నారు.
కుంకుమపువ్వు అత్యంత ఖరీదైన పదార్థాలలో ఒకటి. కానీ దాని వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కుంకుమ పువ్వు బ్యూటీ ప్రొడక్ట్స్ నుండి శరీరానికి అవసరమైన పోషకాలను అందించడం వరకు చాల వాటిలో ఉపయోగిస్తారు. కుంకుమ పువ్వు గుండె & కంటి ఆరోగ్యం, మానసిక స్థితి మెరుగుదల, బరువు తగ్గడం మొదలైన వాటికి కూడా ఉపయోగిస్తారు.

దీని ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎంటెక్ గ్రాడ్యుయేట్ అయిన ప్రవీణ్, హోటల్ మేనేజ్‌మెంట్ చదివిన నవీన్ కేవలం 225 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి లోపల కుంకుమ పువ్వును పెంచి డబ్బు సంపాదిస్తున్నారు. థాయ్‌లాండ్‌లో ట్రైనింగ్ తర్వాత కాశ్మీర్ నుండి 100 కిలోల కుంకుమపువ్వు విత్తనాలను కిలో రూ. 250 చొప్పున కొని రూ.13 లక్షల పెట్టుబడితో ఇంటి పైకప్పుపై అత్యాధునిక ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. సాధారణంగా, కుంకుమపువ్వు పెరగడానికి 10 డిగ్రీల నుండి 20 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. అయితే ఈ అన్నదమ్ములు సూర్యరశ్మికి బదులు ఎల్‌ఈడీ లైట్లను ఉపయోగించి వ్యవసాయం చేశారు. ఏరోపోనిక్ టెక్నాలజీని ఉపయోగించి కొన్ని నెలల్లో 1.5 కిలోల కుంకుమపువ్వును కూడా ఉత్పత్తి చేశారు.
అధిక నాణ్యత గల ల్యాబ్‌లో పండించే ప్రీమియం కుంకుమ పువ్వులు కిలోకు రూ. 5 లక్షల వరకు ఖర్చవుతాయి. కానీ పొలంలో పండే కుంకుమ పువ్వు ధర రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు మాత్రమే. కాబట్టి ఈ విషయం తెలుసుకున్న ఈ ఇద్దరు అన్నదమ్ములు ప్రీమియం కుంకుమ పువ్వును పెంచడానికి వ్యూహాలను కనుగొని అమర్త్వ ఆగ్రో అనే సొంత బ్రాండ్‌ను కూడా స్థాపించారు. స్థానికంగా కుంకుమ పువ్వును కూడా సప్లయ్ చేస్తున్నారు. ఇంకా ప్రీమియం కుంకుమ పువ్వును USA, UK వంటి అంతర్జాతీయ మార్కెట్‌లకు కూడా ఎగుమతి చేస్తున్నారు. నవీన్, ప్రవీణ్ సింధు వారి పెద్ద కలను సాకారం చేసుకోవడానికి ఒక చిన్న స్థలాన్ని ఉపయోగించి తెలివితో డబ్బు సంపాదిస్తున్నారు.












Click it and Unblock the Notifications