ఒక్కరోజు నిద్ర లేకపోతే ఏమవుతుందో తెలుసా?
ఒకరోజు రాత్రి నిద్ర పోకపోతే ఆ తెల్లారి ఏ పనీ చేయలేము.
ఒకరోజు తిండి తినకపోయినా ఏమీ ఆకలి అవదు. అలాగే నీళ్లు లేకపోయినా ఏమీ అనిపించదు. కానీ ఒకరోజు రాత్రి నిద్ర పోకపోతే ఆ తెల్లారి ఏ పనీ చేయలేము. ఎందుకంటే మనిషికి కంటి నిండి నిద్రతోనే శారీరక, మానసిక అలసటలు దూరమవుతాయి. ఒక్కరోజు నిద్ర లేకపోతే ఆ ప్రభావం వయసుమీద పడుతుందంట. ఒక్క రాత్రి నిద్రలేకపోతే ఎంతటి ప్రమాదమో తెలుసా?
ఉరుకులు పరుగులు పెడుతున్న జీవితంలో మనంతట మనే కొన్ని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు ఏదో ఒక పనిచేస్తూ శారీరకంగా, మానసికంగా అలసిపోయివుంటాము. అలిసిపోయామని కొంతమంది కంటి నిండా నిద్రపోయేది కొందరే. కొంతమంది అదే పనిగా తెల్లవారుజాము వరకు పనిచేస్తుంటారు. 24 గంటలు పనిచేస్తూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అందులోను ఇప్పుడు అందరూ ల్యాప్ టాప్ లను ముందేసుకొని కళ్ల ముందు ఆ నీలికాంతిలో అలాగే కూర్చుంటారు. దీనివల్ల వారిపై ఒత్తిడి పెరుగుతోంది.

ఒకరోజు నిద్ర లేకపోతే ఆ ప్రభావం వయసుమీద పడుతుంది. ఒక్కరాత్రి నిద్ర లేకపోతే ఎంతటి ప్రమాదమో జర్మనీకి చెందిన ఓ విశ్వవిద్యాలయం తన అధ్యయనంలో పేర్కొంది. జర్మనీకి చెందిన RWTH అచెన్ విశ్వవిద్యాలయం ఎవా మరియా 19 నుంచి 39 ఏళ్లు గల 134 మందిపై ప్రయోగాలు చేశారు. ఒక్క రాత్రి నిద్ర లేకపోవడంవల్ల మన మెదడు రెండు సంవత్సరాలు ఫ్రీజ్ అవుతుందని తేలిసింది. నిద్రపోయినా, నిద్ర లేని రాత్రుల్లో ఎమ్మారై స్కాన్ ద్వారా మెదడుకు సంబంధించిన వయసును పరిశీలించారు. యువకుల్లో, వృద్ధాప్యం వంటి దిశలో మెదడు నిర్మాణాన్ని మారుస్తుంది. ఈ మార్పులు తిరిగి రికవరీ అయ్యే నిద్ర ద్వారా మార్చబడతాయని ఎవామరియా వెల్లడించారు. కాబట్టి నిద్ర పోకుండా అర్థరాత్రి వరకు మేల్కొని ఉండటం, సిగరెట్లు తాగుతూ, మందు కొడుతూ అర్థరాత్రి వరకు మేలుకొని ఉండేవారికి ఎవామరియా సర్వే ఒక గుణపాఠం లాంటిదని నిపుణులు వెల్లడిస్తున్నారు.












Click it and Unblock the Notifications