Bottle Gourd Benefits: సొరకాయ ఉపయోగాలు తెలిస్తే దాన్ని అస్సలు వదిలిపెట్టారు
కూరగాయాల్లో సొరకాయకు ఉన్న ప్రత్యేకత వేరు. ఎందుకంటే సొరకాయను ఎలాంటి రసాయనాలు లేకుండా పండిస్తారు. తెలంగాణలో దీన్ని ఆనిగపుకాయ అని కూడా అంటారు. సొరకాయ కుకుర్ బిటాన్సి కుటుంబానికి చెందినదని... దీని శాస్త్రీయ నామం లాజనేరియా వల్గారిస్ అంటారు. సొరకాయ పీచు, నీటితో నిండిన కూరగాయ. ఇందులో ఐరన్, పొటాషియంతోపాటు విటమిన్‌లు కూడా ఉంటాయి.
జుట్టు తెల్లిబడితే..
దేహంలో వృద్ధి చెందిన విషపూరిత వ్యర్థాలను తొలగించడంలో సొరకాయ సమర్థంగా పని చేస్తుంది. ఇందులో సహజసిద్ధంగా ఉన్న మత్తు కలిగించే గుణం వల్ల మానసిక ఒత్తిడి తగ్గడంతోపాటు త్వరగా నిద్రపోతారు. సొరకాయ రసం తాగడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చట. జుట్టు తెల్లబడిన టీనేజ్ పిల్లలు రోజూ ఒక గ్లాసు రసం తాగితే జుట్టు నల్లబడే అవకాశం ఉందట.

బీపీ తగ్గుతుంది..
సొరకాయ తినడానికే కాకుకండా ఈత కొటిటడానికి సొరకాయ బుర్ర ఉపయోగపడుతుంది. పూర్వకాలంలో సొరకాయలోని నీళ్లు పోసుకుని తాగేవారట. సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. మన శరీరంలోని అధిక వేడిని బయటకు పంపి మనకు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. హైబీపీ ఉన్న వాళ్లు ఒకరోజు సొరకాయ తిని మరుసటి రోజు బీపీ చెక్ చేసుకుంటే ఫలితం కళ్ల ముందు కనిపించి తీరుతుందట.












Click it and Unblock the Notifications