తిరుపతి- రామేశ్వరం టూర్ ప్యాకేజీని ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

IRCTC: పవిత్ర కార్తీక మాసం ఆరంభమైన నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రఖ్యాత శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారు జాము నుంచే పలు ఆలయాల్లో భక్తులు బారులు తీరి నిల్చున్నారు. భక్తి ప్రపత్తులతో దీపాలను వెలిగించి పూజలు చేస్తోన్నారు.

కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు.

IRCTC to run Rameshwaram - Tirupati Dakshin Darshan Yatra by Bharat Gaurav special train

ఏడు రాత్రులు/ఎనిమిది పగళ్లు ఈ యాత్ర సాగుతుంది. ఈ నెల 21వ తేదీన ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరుతుంది. సీఎస్టీతో పాటు, థానె, కల్యాణ్, కర్జాత్, లోనావాలా, పుణే, దౌండ్, కుర్దువాడి, షోలాపూర్, కలబురగి స్టేషన్లల్లో హాల్ట్ సౌకర్యం ఉంది. ఆయా స్టేషన్లల్లో భక్తులు బోర్డింగ్/డీబోర్డింగ్ అయ్యేలా ప్రయాణికులు తమ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు.

ఈ ప్యాకేజీలో కన్యాకుమారి- రామేశ్వరం- మధురై- తిరుపతి ఆలయాలు ఉన్నాయి. కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపం, అక్కడి ఆలయాన్ని సందర్శించవచ్చు. రామేశ్వరంలో వెలిసిన శ్రీ రామనాథ స్వామి ఆలయం, మధురైలో మీనాక్షి అమ్మవారి ఆలయం ఈ ప్యాకేజీలో ఉంది. తిరుమల శ్రీవారు, తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడంతో ఈ యాత్ర ముగుస్తుంది.

ఈ ప్యాకేజీ కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 14,880 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్. థర్డ్ ఏసీ కోసం 27,630 రూపాయలు, సెకెండ్ ఏసీ కోసం 33,880 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.

దేశంలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను అనుసంధానిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ.. భారత్ గౌరవ్ పేరుతో ఈ ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్న విషయం తెలిసిందే. వీటికి ప్రయాణికుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ప్రారంభమైన అన్ని చోట్ల కూడా ప్రయాణికుల ఆదరణ భారీగా ఉంటోంది.

దీన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు జోన్ల వారీగా భారత్ గౌరవ్ ప్రత్యేక రైళ్లను మరింత విస్తృతపరిచారు. వాటి ట్రిప్‌ల సంఖ్యనూ పెంచుతోన్నారు. మున్ముందు విజయవాడ/విశాఖపట్నం నుంచీ ఆయా పుణ్యక్షేత్రాలకు ఈ రైల్ కనెక్టివిటీని కల్పించే దిశగా చర్యలు తీసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+