SBIలో అదిరిపోయే పథకం
ఇందులో చేరితే రాబడి పొందడమే కాకుండా ఇతర రెగ్యులర్ FD పథకాలతో పోలిస్తే ఇది చాలా ప్రత్యేకమైందిగా చెప్పుకోవచ్చు.
భారతీయ స్టేట్ బ్యాంక్ అదిరిపోయే పథకాన్ని అందిస్తోంది. ప్రత్యేకమైన FD పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇందులో చేరితే రాబడి పొందడమే కాకుండా ఇతర రెగ్యులర్ FD పథకాలతో పోలిస్తే ఇది చాలా ప్రత్యేకమైందిగా చెప్పుకోవచ్చు. ఇతర రెగ్యులర్ ఫిక్స్‌డ్ డిపాజిట్(FD) పథకాలతో పోలిస్తే.. ఈ పథకం ప్రత్యేకమైందని చెప్పుకోవచ్చు. కాలపరిమితి తక్కువగా ఉన్నప్పటికీ వడ్డీ రేటు ఎక్కువగా ఉంది.
స్పెషల్ FD పేరు సర్వోత్తం ఇది నాన్ క్యాలబుల్ టర్మ్ డిపాజిట్ పథకం. దీని కాలపరిమితి రెండు సంవత్సరాలే. అంటే స్వల్పకాలంలో డబ్బులు దాచుకోవాలని భావించేవారు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. అంతేకాకుండా అధిక రాబడిని పొందవచ్చు. ఇందులో చేరేవారు రూ.2 కోట్ల వరకు దాచుకోవచ్చు. కనీసం రూ.15 లక్షలన్నా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

SBI వెబ్ సైట్ ప్రకారం చూస్తే సర్వోత్తం FD పథకం రెండు సంవత్సరాల కాలపరిమితితో డబ్బులు దాచుకోవచ్చు. ఇలా డబ్బులు దాచుకున్నవారికి 7.1 శాతం వడ్డీ ధర లభిస్తోంది. అయితే రెగ్యులర్ వినియోగదారులకు వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్లకైతే 7.6 శాతం వడ్డీ వస్తుందని చెప్పుకోవచ్చు. ఏడాది కాలపరిమితితో ఫిక్స్డ్ డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. రెండు సంవత్సరాల కాలపరిమితితో బ్యాంకులో డబ్బులు దాచుకోవాలనుకుంటే వడ్డీరేటు 7.4 శాతంగా ఉంది. ఫ్రిబవరి 17 నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయని బ్యాంకు వెల్లడించింది.
ఉదాహరణకు మీరు SBI అందిస్తున్న ఈ సర్వోత్తం స్కీమ్‌లో చేరితే.. మీరు రూ. 20 లక్షలు ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. కాలపరిమితి రెండు సంవత్సరాలు. మెచ్యూరిటీ సమయంలో చేతికి రూ. 23.15 లక్షలు వస్తాయి. అంటే మీకు వడ్డీ రూపంలో రూ. 3 లక్షలకు పైగా వస్తాయి. అదే సీనియర్ సిటిజన్స్‌కు అయితే రూ. 3.3 లక్షల వరకు వడ్డీ రాబడి ఉంటుంది. SBI తన FDలపై వడ్డీ ధర 0.25 శాతం మేర పెంచింది.












Click it and Unblock the Notifications