శ్రావణంలో పెళ్లి ముహూర్తాలివే.. ఇప్పుడు కాకుంటే 4 నెలలు వెయిట్ చేయాల్సిందే..
శ్రావణ మాసం శుభకరం.. మహిళలు పూజల్లో నిమగ్నం అవుతుంటారు. ఈ సారి ఐదు శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. మొదటి శ్రావణ శుక్రవారం పూర్తి కాగా.. రెండో శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేస్తుంటారు. మూడో శుక్రవారం రాఖీ పౌర్ణమి వచ్చింది. అయితే శ్రావణ మాసంలో సుముహూర్తాలు కూడా బాగానే ఉన్నాయి. మంచి ముహూర్తాలు పెట్టడంతో.. పెళ్లి పనుల్లో పెళ్లి చేసే వారు బిజీగా ఉన్నారు.

21వ తేదీ వరకే
శ్రావణ మాసంలో ఆగస్టు నెల 21 వరకే పెళ్లికి ముహూర్తాలు ఉన్నాయట. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెళ్లిళ్లు జరగబోతున్నాయి. ఆగస్టు ఒకటో తారీకు నుంచి మూడోవారం వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ముహుర్తాలు పెట్టుకున్న వారి ఇళ్లల్లో పెళ్లి హాడావిడి మొదలైంది. జులై 31, ఆగస్టు 1, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12, 13, 16, 17, 20, 21 తేదీల్లో అధిక ముహూర్తాలు ఉన్నాయి.

4 నెలలు వెయిటంగ్
ఆగస్టులో ముహూర్తం కుదరకపోతే తర్వాత 4 నెలల పాటు ఎదురు చూడాల్సి వస్తోంది. ఆగస్టు 6వ తేదీ రాత్రి ముహూర్తానికి భారీగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. గతంలో శ్రావణ మాసంలో ముహుర్తం కుదరకపోతే.. కార్తీక మాసంలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకునేవారు. జులై, ఆగస్టు నెలలలో కురిసే వానలకు భయపడి అక్టోబరు, నవంబరు నెలల్లో వచ్చే కార్తికంలోని ముహూర్తాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ఈసారి భిన్నమైన పరిస్థితి నెలకొంది. వచ్చే నాలుగు నెలలు గురు, శుక్ర మూఢాలు రావడంతో ముహూర్తాలు లేవని పండితులు చెబుతున్నారు.

మార్గశిరంలో..
ఇప్పుడు కాకపోతే డిసెంబరులో వచ్చే మార్గశిరం వరకు ఆగాల్సి ఉంటుందని చెబుతున్నారు. 20, 21 తేదీల్లో రోహిణీ నక్షత్రం రోజు కూడా అధికంగా పెళ్లిళ్లు ఉన్నాయి. రోహిణి నక్షత్రం ఎక్కువమంది వధూవరులకు కలిసి వస్తుందని పురోహితులు చెబుతున్నారు. అందుకోసమే ఉన్న ముహూర్తంలో పెళ్లి చేసుకుంటున్నారు. పనులు కాకుంటే చిన్నగా చేసేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications