గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

chandrababu on ippatam : రోడ్లేసే మొహాలేనా ? పవన్ నూ రానివ్వరా ? దాడులు, కూల్చివేతలేనా !

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై విపక్ష నేత చంద్రబాబు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇవాళ గుంటూరు జిల్లా ఇప్పటంలో చోటుచేసుకున్న పరిణామాలు, నిన్నటి కూల్చివేతలు, నిన్న నందిగామలో తనపై రాళ్లదాడి ప్రయత్నం వంటి ఘటనల్ని గుర్తు చేస్తూ చంద్రబాబు పలు ట్వీట్లు చేశారు. ఇందులో వైసీపీ ప్రభుత్వ తీరును చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు.

చంద్రబాబు తన ట్వీట్ లో "ఈ వైసిపి ప్రభుత్వానికి పోయే కాలం దాపురించి దిక్కుమాలిన పనులు చేస్తుంది. శిశుపాలుడిలా జగన్ రెడ్డి వంద తప్పులు దాటాయి...ఇక మిగిలింది ప్రభుత్వ పతనమే. ఆంధ్రప్రదేశ్ అంటే హింస, దాడులు, కూల్చివేతలు, అడ్డగింతలు, అక్రమ అరెస్టులు అన్నట్లుగా మార్చేశారు." అని ఆరోపించారు.

chandrababu tweet war on ys jagan over ippatam demolitions and stone attack on him

ఇప్పటం పరిణామాల్ని విమర్శిస్తూ మరో ట్వీట్ లో "ముఖ్యమంత్రి అహంకారానికి, అధికార మదానికి జవాబు చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు. 600 ఇళ్లున్న ఇప్పటం గ్రామంలో 120 అడుగులకు రోడ్డు విస్తరిస్తారా? మీ దుర్బుద్ధి, రాజకీయ కక్ష ప్రజలకు అర్థం కాదు అనుకుంటున్నారా? మీవి రోడ్లు వేసే మొహాలేనా? " అని చంద్రబాబు ప్రశ్నించారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టూర్ కు అడ్డంకులపై మరో ట్వీట్ లో " ఇప్పటం గ్రామం వెళుతున్న జనసేన అధ్యక్షులు @PawanKalyanను అడ్డుకుంటేనో....చీకట్లో మా పర్యటనపై రాళ్లు వేస్తేనో మీరు పైచేయి సాధించలేరు. కూల్చడం మాని ఏదైనా కట్టి చూడండి...ఆ తృప్తి ఏంటో అర్థం అవుతుంది." అంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

English summary
tdp chief chandrababu on today slams ysrcp govt for ippatam demolitions and stone attack on him yesterday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X