జగన్ సీఎంగా నవ్యాంధ్రలో నవశకం ఆరంభం అన్న విజయసాయి రెడ్డి

నిన్నటి దాకా చంద్రబాబు మీద, టీడీపీ నేతల మీద, టీడీపీ పాలన మీద విరుచుకుపడిన విజయసాయి రెడ్డి ఇప్పుడు వైసీపీ పాలనకు కితాబిస్తున్నారు. జగన్ సీఎంగా నవ్యాంధ్రలో నవశకం ఆరంభం అయిందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా సైరాపంచ్ లతో చంద్రబాబుకు ఊపిరి ఆడకుండా చేసిన విజయసాయి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు. ఇక జగన్ పాలన ప్రారంభం కావటంతో ఆయన పాలన ఎలా ఉండబోతుందో చెప్తూ ట్వీట్ చేశారు .

నిన్నటి దాకా విపక్షాలపై విరుచుకుపడిన విజయసాయి రెడ్డి , ఇప్పుడు స్వపక్షానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిన్న నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ట్విట్టర్‌లో ఆసక్తికరమైన పోస్టు చేశారు .

Jagan as CM Navashakam begun in navyandhra .. said Vijayasai reddy

జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంతో నవ్యాంధ్రలో నవశకం మొదలయ్యిందని పేర్కొన్నారు. జగన్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అవినీతి రహిత పాలనను అందిస్తారని చెప్పారు. పారదర్శకమినా పాలన జగన్‌ అందించనున్నారని తెలిపారు. ప్రజల కష్టాలను తొలగించడమే ఆయన ఆకాంక్ష అని పేర్కొన్న విజయసాయి రెడ్డి ఇందుకోసం జగన్ నిరంతరం శ్రమిస్తారని ట్వీట్‌ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+