హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జర్నలిస్టులకు గుడ్ న్యూస్: ఇకపై 2/3 ఆన్ లైన్‌లో అందుబాటులో..

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ ఎండీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్.. ఒక్కో కీలక అంశంపై ఫోకస్ చేస్తున్నారు. ఏళ్లుగా జరగని పనులను చకచకా చేస్తున్నారు.
ఇటీవల ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సంస్థకు ఆదాయంపై ఫోకస్ చేశారు. దసరా సమయంలో సిటీ నుంచి జనం ఊర్లకు వెళుతుంటారు. అప్పుడు అదనపు చార్జీ లేకుండా బస్సులను నడిపించారు. మంచి ఆదాయమే సమకూరింది. ఆర్టీసీలో కొన్ని విభాగాలకు కొలువులను ప్రకటించారు. దీంతోపాటు ఆర్టీసీ బస్సులను పెళ్లి కోసం బుక్ చేసుకుంటే గిప్టులను అందజేస్తున్నారు. ఈసారి జర్నలిస్టులకు కూడా గుడ్ న్యూస్ అందజేశారు.

జర్నలిస్టులకు టీఎస్ ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. ట్విట్టర్ వేదికగా పలువురు జర్నలిస్టులు తమ సమస్యను తెలిపారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకు అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులు బస్సు ప్రయాణంలో టికెట్ తీసుకునేందుకు .. ప్రత్యేక బస్సు పాస్ చూపించి 2/3 కన్సెషన్ ఆప్షన్ కింద టికెట్ తీసుకునే అవకాశం ఉండేది. టీఎస్ ఆర్టీసీకి చెందిన వెబ్ సైట్ నుంచి కూడా టికెట్లు బుక్ చేసుకునేందుకు రాయితీతో కూడిన అవకాశం కల్పించారు. తాజాగా ఆర్టీసీ వెబ్ సైట్‌లో జర్నలిస్టు 2/3 కన్సెషన్ ఆప్షన్ తీసుకొచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ విషయంపై సూచనలు తెలిపిన జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు.

2/3 rtc ticket charge concession to available online

ఇదివరకు జర్నలిస్టులు బస్సులో ట్రావెల్ చేసే సమయంలోనే రాయితీ లభించేది. ముందుగా టికెట్ బుక్ చేసుకుంటే ఆ వెసులుబాటు ఉండేది కాదు. దీంతో జర్నలిస్టులు తమ సమస్యను ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సజ్జనార్ స్పందించారు. వెబ్ సైట్‌లో కూడా బుక్ చేసుకునేలా వెసులుబాటు కల్పించారు. సమస్యను తెలియజేసినందుకు థాంక్స్ కూడా చెప్పారు. వాస్తవానికి ఈ సమస్య చిన్నదే అయినా.. దాని వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. దానిని కూడా సజ్జనార్ పరిష్కరించారు. సో జర్నలిస్టులు ఎండీ సజ్జనార్‌కు ధన్యవాదాలు తెలిపారు.

English summary
2/3 rtc ticket charge concession to available online rtc md sajjanar said to media. recently journalists problem told to rtc md.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X