సన్ రైజర్స్ టీమ్ లో పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ ఎంట్రీ: అంతా తలకిందులు: ఐపీఎల్ వేళ..
ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ అనుబంధ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ లీడ్స్ చిక్కుల్లో పడింది. ఆ జట్టు 'ది హండ్రెడ్' ప్లేయర్స్ వేలంలో పాకిస్తానీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేయడంతో వివాదాలకు కేంద్రబిందువు అయింది. ఈ సీజన్ కోసం జరిగిన వేలంలో సన్‌రైజర్స్ లీడ్స్ చీఫ్ కావ్యా మారన్ పాకిస్తానీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను స్వయంగా కొనుగోలు చేశారు. రూ.1.90 లక్షల పౌండ్‌లకు అతన్ని తీసుకున్నారు. దీని విలువ భారతీయ కరెన్సీలో సుమారు 2.34 కోట్ల రూపాయలు.
భారత్ కు చెందిన ఫ్రాంచైజీ ఓ పాకిస్తానీ ఆటగాడిని కొనుగోలు చేయడం ఇదే తొలిసారి. లండన్‌లో జరిగిన ఈ వేలంలో సన్‌రైజర్స్ లీడ్స్ సీఈఓ కావ్య మారన్, హెడ్ కోచ్ డేనియల్ వెటోరితో కలిసి పాల్గొన్నారు. అబ్రార్ అహ్మద్‌ను దక్కించుకునేందుకు ట్రెంట్ రాకెట్స్‌ను అధిగమించి సన్‌రైజర్స్ లీడ్స్ అతడిని సొంతం చేసుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చ చెలరేగింది. అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన తర్వాత దేశంలో అనేక మంది క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు.]

పాకిస్తానీ ఆటగాడిని తీసుకోవడం జాతీయ భావాలకు విరుద్ధమంటూ మండిపడుతున్నారు. సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ, సీఈఓ కావ్య మారన్‌ను తప్పుపడుతున్నారు. ఐపీఎల్‌లో పాకిస్తానీ ఆటగాళ్ళు లేనప్పుడు ఇతర టోర్నమెంట్ల కోసం ఆ దేశ ప్లేయర్లను తీసుకోవడంలో అర్థం లేదంటూ భగ్గుమంటోన్నారు. ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుందని ప్రశ్నిస్తోన్నారు. దీని తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి.
అబ్రార్ అహ్మద్ కొనుగోలు తర్వాత కొన్ని గంటల్లోనే సన్‌రైజర్స్ లీడ్స్ అధికారిక ఎక్స్ అకౌంట్ సస్పెండ్ అయ్యింది. దీనికి గల కారణాన్ని ఈ టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ఇంకా స్పష్టం చేయలేదు. సన్‌రైజర్స్ లీడ్స్ హెడ్ కోచ్ డేనియల్ వెటోరి ఈ వివాదంపై స్పందించారు. అబ్రార్ గురించి ఆస్ట్రేలియా ఆటగాళ్ల సలహా మేరకు తీసుకున్నామని, బౌలింగ్, మిస్టరీ స్పిన్‌ను బట్టే కొనుగోలు చేయాలని నిర్ణయించామని తెలిపారు.
ది హండ్రెడ్ వేలంలో అబ్రార్ అహ్మద్ కంటే ముందు మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌ను అమ్ముడుపోయాడు. బర్మింగ్‌హామ్ ఫోనిక్స్ అతన్ని కొనుగోలు చేసింది. దీనికోసం రూ.1.40 లక్షల పౌండ్‌లను వెచ్చించి జట్టులోకి తీసుుంది. దీని విలువ సుమారు 1.72 కోట్ల రూపాయలు. హండ్రెడ్స్ లీగ్ వేలం తొలి రౌండ్‌లో హారిస్ రవూఫ్, షాదాబ్ ఖాన్, సయిమ్ అయూబ్ వంటి పాక్ ఆటగాళ్లు అమ్ముడుపోలేదు.
-
ఈసారి IPL 2026 Opening Ceremony లేదా ? ఏం జరుగుతోంది ? -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications