మళ్లీ వాన, మూడు రోజులు, తేలికపాటి వర్షాలే, కానీ ఆందోళన

తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ వాన గండం ఉంది. రెండు నుంచి మూడు రోజుల్లో వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇప్పటికే వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పంట కోతకు వస్తోన్న సమయంలో.. మళ్లీ వాన అంటే అన్నదాత తల్లడిల్లిపోతున్నారు.

పశ్చిమ, నైరుతి దిశల నుంచి ఇవాళ గాలులు వీస్తాయని తెలిపింది. ఈ నెల 18వ తేదీన ఉత్తర బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఒడిశా, పశ్చిమబెంగాల్, తీరం వెంబడి ఆవర్తనం ఏర్పడుతుందని చెప్పింది. హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు.

another 3 days rain lashes in telangana

వర్షానికి సంబంధించి హైదరాబాద్ గురించి అయితే చెప్పక్కర్లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తోన్నాయి. దీంతో పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరింది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది.

ఈ సారి వర్ష బీభత్సం ఎక్కువే ఉంది. ఇప్పటికే ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ గ్రామంలో గరిష్ట స్థాయి వర్షం కురిసింది. పంటలకు సరిపోయేంత నీరు ఉంది. కానీ పంట ఎదిగిన సమయంలో వాన పడటంతో ఇబ్బందేనని పలువరు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+