Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉదయం 4గంటలకు.. మాణిక్కంఠాగూర్, రేవంత్ రెడ్డి రహస్యచర్చలు ఎవరితో? కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్!!

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఆపరేషన్ ఆకర్ష కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సారధ్యంలో చేరికలపై దృష్టి సారించినట్టు ప్రధానంగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలపై పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా రంగంలోకి దిగినట్టు కనిపిస్తుంది. ఆదివారం తెల్లవారుఝామున నాలుగు గంటలకే మాణిక్కం ఠాగూర్ హైదర్ గూడా లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి పార్టీ నేతలను కలవడం, ఆపై వారంతా కలిసి బయటకు వెళ్లడం ఇప్పుడు సొంత పార్టీలో ఆసక్తికర చర్చకు కారణం గా మారింది.

ప్రోటోకాల్ విభాగానికి తెలీకుండా రహస్యంగా బయటకు వెళ్ళిన మాణిక్కం ఠాకూర్

ప్రోటోకాల్ విభాగానికి తెలీకుండా రహస్యంగా బయటకు వెళ్ళిన మాణిక్కం ఠాకూర్

సాధారణంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ఎప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పటికీ ఆయనకు సంబంధించిన వసతి ఏర్పాట్లు, కార్యక్రమాలు అన్ని పార్టీ ప్రోటోకాల్ విభాగం చూసుకుంటుంది. ఆయన ఎవరిని కలవాలన్నా, ఏం చేయాలన్న పార్టీ ప్రోటోకాల్ విభాగమే ఏర్పాట్లు చేస్తుంది . కానీ ప్రోటోకాల్ విభాగానికి కూడా తెలియకుండా మాణిక్కం ఠాగూర్ తెల్లవారుజామున నాలుగు గంటల నుండి 11 గంటల మధ్య ఎవరికీ అందుబాటులో లేకుండా పోవడం పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చగా మారింది. ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యులు ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఉదయం 4 గంటలకు.. రేవంత్, జానారెడ్డి, సునీల్ కనుగోలుతో పాటు మాణిక్కం ఠాగూర్

ఉదయం 4 గంటలకు.. రేవంత్, జానారెడ్డి, సునీల్ కనుగోలుతో పాటు మాణిక్కం ఠాగూర్

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్కం ఠాగూర్ ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి బయటకు వెళ్లారు. ఆయనతో పాటు ఆయన కారులో పొలిటికల్ కన్సల్టెంట్ కనుగోలు సునీల్ కూడా ఉన్నట్లుగా సమాచారం. ఇక వీరిద్దరూ కలిసి టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, చేరికల కమిటీ చీఫ్ మాజీ మంత్రి జానారెడ్డిని కలిసినట్టు తెలుస్తుంది. అయితే ఈ నలుగురూ కలిసి ఎక్కడికి వెళ్లారు? ఎవరిని కలిశారు అన్నది? మాత్రం పార్టీ వర్గాలకు కూడా అంతుచిక్కకుండా ఉంది. అంత రహస్యంగా వీరంతా వెళ్లి కలిసిన నేతలెవరూ అన్నది ఇప్పుడు పార్టీ నేతలలో హాట్ టాపిక్ అయింది.

రహస్యంగా వెళ్ళింది ఎవరి దగ్గరకు... పార్టీ నేతల్లో చర్చ

రహస్యంగా వెళ్ళింది ఎవరి దగ్గరకు... పార్టీ నేతల్లో చర్చ


ఇటీవల పార్టీలో చేరికలపై ఫోకస్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ చేరికలలో భాగంగానే ఎవరైనా అసంతృప్త టీఆర్ఎస్ నేతల ఇంటికి వెళ్లి ఉంటారా? లేక కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వెళ్లిపోయిన నేతలను తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా వారితో చర్చించేందుకు వెళ్లారా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే సమయంలో కొందరు బీజేపీ సీనియర్ నేత ఇంటికి వెళ్లారు అంటూ ఆసక్తిగల చర్చకు తెర తీసినట్లు సమాచారం. చాలా కాలంగా బిజెపిలో అసంతృప్తితో ఉన్న సదరు నేతను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్లు కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+