Bigg Boss Telugu 7: కంటెస్టెంట్ల లిస్ట్‌లో నటుడు శివాజీ- కంప్లీట్ లిస్ట్ ఇదే..!!

హైదరాబాద్: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 త్వరలో ఇంటింటినీ పలకరించబోతోంది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి బిగ్ బాస్ సీజన్ 7 ఆరంభం కాబోతోంది.. గ్రాండ్‌గా. దీనికి సంబంధించిన లోగో ప్రోమో ఇదివరకే విడుదలైంది.

నాగార్జున తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌‌పై దీన్ని పోస్ట్ చేశారు. ఆ వెంటనే అది వైరల్‌గా మారింది. ఇప్పటివరకు అయిదు సీజన్లల్లో బిగ్ బాస్ హౌస్‌లో కనిపించిన గ్లామర్ వేరు.. ఇప్పుడు చూడబోయే ట్రీట్ వేరు. ప్రోమో దీన్ని ప్రూవ్ చేస్తోంది కూడా. 2017లో తొలిసారిగా తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సందడి మొదలైంది. నిరాటంకంగా కొనసాగుతూ వస్తోంది.

Bigg boss telugu 7: grand launch on September 3, contestants list

కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల్లో కూడా దీనికి బ్రేక్ పడలేదు. తొలి సీజన్‌కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆ తరువాత ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నాడు. ఆ సీజన్‌లో నటుడు శివబాలాజీ టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. ఆదర్శ్ రన్నరప్. రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించాడు.

ఆ సీజన్‌లో కౌశల్ మందా విన్నర్ కాగా.. ప్లేబ్యాక్ సింగర్ గీతా మాధురి రెండో స్థానంలో నిలిచారు. మూడో సీజన్ నుంచి అక్కినేని అందగాడి హవా మొదలైంది. 2019 నాటి మూడో సీజన్‌లో నేపథ్య గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ విజేతగా ఆవిర్భవించాడు. టాప్ యాంకర్ శ్రీముఖి రెండో స్థానానికి పరిమితం అయ్యారు. నాలుగో సీజన్‌ టైటిల్‌ను అభిజిత్ ఎగరేసుకెళ్లాడు. అఖిల్ సార్థక్ రన్నరప్. ఆ తరువాతి సీజన్‌లో వీజే సన్నీ ఛాంపియన్ కాగా యూట్యూబర్ షణ్ముఖ్‌ది రెండోస్థానం.

Bigg boss telugu 7: grand launch on September 3, contestants list

ఇక బిగ్ బాస్ సీజన్ 7 ఆదివారం సాయంత్రం 7 గంటలకు గ్రాండ్‌గా ఆరంభం కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రొమోను నిర్వాహకులు కొద్దిసేపటి కిందటే విడుదల చేశారు. కలర్‌ఫుల్‌గా కనిపించిందీ ప్రొమో. నాగార్జున తనదైన స్టైల్‌లో అదరగొట్టాడు. ఉల్టా, పుల్టా అంటూ మెస్మరైజ్ చేశాడు.

ఈ సీజన్‌ టైటిల్ కోసం పోటీ పడే కంటెస్టెంట్ల పేర్లు ఇంట్రెస్టింగ్ కలిగిస్తోంది. శోభా షెట్టి, విష్ణుప్రియ, ఆటా సందీప్, అమర్‌దీప్ చౌదరి, గౌతమ్ కృష్ణ, భోలే షావలి, ప్రత్యూష, షకీలా, టేస్టీ తేజా, మహేష్ ఆచంట, అంబటి అర్జున్, అపూర్వ, దామిని భాట్ల, ఫర్జానా, పల్లవి ప్రశాంత్, పూజా మూర్తి, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, శివాజీ, శుభశ్రీ రాయగురు పాల్గొననున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+