floods telangana heavy rains hyderabad central government pm narendra modi telangana government వరదలు తెలంగాణ భారీ వర్షాలు అంచనా హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ లో కేంద్ర బృందం ... వరద నష్టం పై ఉన్నతాధికారులతో భేటీ
హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలను వరదలు ముంచేశాయి. గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ నగరం వరద ప్రభావానికి తీవ్రంగా నష్టపోయింది. భారీ వర్షాలు, వరదల కారణంగా కలిగిన అపార నష్టానికి కేంద్ర ప్రభుత్వం నుండి సహాయాన్ని అర్థిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. వరదల కారణంగా దెబ్బతిన్న హైదరాబాద్ నగరాన్ని ఆదుకోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.
హైదరాబాద్ వరదలతో 'కారు'కు రివర్స్ గేర్: జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పుడు లేనట్టే
ఈ నేపథ్యంలో వరద నష్టం అంచనా వేయడానికి నేడు కేంద్ర బృందం హైదరాబాద్ కు చేరుకుంది.
హైదరాబాద్ తో పాటుగా, తెలంగాణ రాష్ట్రంలో వరద నష్టం పై ఈ బృందం నివేదిక తయారు చేయనుంది. రెండు రోజుల పాటు హైదరాబాద్ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, అక్కడి పరిస్థితులను తెలుసుకుని హైదరాబాద్ లో వరదలు వల్ల కలిగే నష్టాన్ని అంచనావేసి, కేంద్రానికి నివేదికను అందించనున్నారు. హైదరాబాద్ మాత్రమే కాకుండా వరద ప్రభావిత జిల్లాలలో పంట నష్టాన్ని కూడా అంచనా వెయ్యనుంది.

నేడు హైదరాబాద్ కు చేరుకున్న కేంద్ర బృందం బి ఆర్ కే భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో పాటుగా, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
రాష్ట్రం పై వరద ప్రభావాన్ని అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ తో పాటు వరదలతో ప్రభావితమైన జిల్లాలలోనూ రెండు రోజుల పాటు పర్యటించి పంటనష్టాన్ని కూడా అంచనా వేయనున్నారు. ఈరోజు హైదరాబాద్ తోపాటు సిద్దిపేట జిల్లాలో కేంద్ర బృందం సభ్యులు పర్యటించి పంట నష్టం , ఆస్తి నష్టం అంచనా వేస్తారు .
కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ వశిష్ట నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం అధికారులతో భేటీ కాగా అధిక వర్షాలు వరదల వల్ల కలిగిన నష్టాన్ని సంబంధిత వివరాలను అధికారులు కేంద్ర బృందానికి వివరించారు . నష్టానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను వారికి చూపించి వివరిస్తున్నారు. వీరు ఇచ్చే నివేదిక ప్రకారమే కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి అందించే సహాయం ఆధారపడి ఉంది.