హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్డర్ చెయ్యకున్నా పార్సిల్ వచ్చిందంటూ ఫోన్.. క్యాన్సిల్ చెయ్యాలంటే ఓటీపీ.. చెప్తే ఖాతాలు ఖాళీ!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సైబర్ నేరాలను కట్టడి చేయడం కోసం సైబర్ పోలీసులు ఎంత ప్రయత్నాలు చేస్తున్నా, ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ఎన్ని చర్యలు చేపడుతున్నా నిత్యం సైబర్ నేరగాళ్ల చేతుల్లో అనేక మంది అమాయకులు చిక్కుకుని తమ డబ్బులను పోగొట్టుకుంటున్నారు. ఇక సైబర్ నేరాల నియంత్రణకు, నేరగాళ్లకు చెక్ పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, రోజుకో కొత్త పంథాలో సైబర్ నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లో జరిగిన ఈ ఘటనతో సైబర్ మోసాలపై తస్మాత్ జాగ్రత్త అని ప్రజలను హెచ్చరిస్తున్నారు పోలీసులు.

గచ్సిబౌలిలో ఓ వ్యక్తి ఆన్లైన్ లో ఆర్డర్ చెయ్యకున్నా ఆర్డర్ వచ్చిందని మోసం

గచ్సిబౌలిలో ఓ వ్యక్తి ఆన్లైన్ లో ఆర్డర్ చెయ్యకున్నా ఆర్డర్ వచ్చిందని మోసం

ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ గచ్చిబౌలి కి చెందిన శ్రీనివాస్ హైటెక్ సిటీలో ఐటి ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఇక ఆయనకు ఆన్లైన్ డెలివరీ బాయ్ ఫోన్ చేసి మీ పేరుమీద పార్సిల్ వచ్చింది అంటూ పేర్కొన్నారు. అడ్రస్ ఎక్కడ అంటూ ప్రశ్నించారు. అయితే తానే మీ ఆర్డర్ పెట్టలేదని, తనకు ఎందుకు డెలివరీ వచ్చిందని ప్రశ్నించిన సదరు ఉద్యోగికి , మీరు ఆర్డర్ పెట్టకపోతే, మీ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాము అంటూ డెలివరీ బాయ్ తెలిపారు.

ఆర్డర్ క్యాన్సిల్ కు ఓటీపీ చెప్పిన శ్రీనివాస్.. బ్యాంక్ ఖాతా లూటీ

ఆర్డర్ క్యాన్సిల్ కు ఓటీపీ చెప్పిన శ్రీనివాస్.. బ్యాంక్ ఖాతా లూటీ


ఇక శ్రీనివాస్ ను నమ్మించి ఆపై మీ ఫోన్ కి ఒక ఓటిపి వస్తుంది, దానిని తనకు చెబితే ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది అంటూ పేర్కొన్నారు. దీంతో శ్రీనివాస్ సదరు వ్యక్తికి ఓటిపి చెప్పాడు. దీంతో క్షణాలలో శ్రీనివాస్ ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయింది. ఫోన్ పెట్టేసిన తర్వాత తన బ్యాంక్ ఖాతా ఖాళీ అవ్వటంతో అవాక్కైన శ్రీనివాస్ కు జరిగిన మోసం అర్ధం అయ్యింది. వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక్క శ్రీనివాస్ కేసు మాత్రమే కాదు, ఇటీవల జంటనగరాల్లో అనేక కేసులు ఇటువంటి కేసులే నమోదయ్యాయి.

 ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ కావడంతో కొత్త తరహా మోసం

ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ కావడంతో కొత్త తరహా మోసం

ఇటీవల కాలంలో ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ కావడంతో, ప్రజల ఆన్లైన్ షాపింగ్ ను కూడా ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వినియోగదారులు ఆర్డర్ పెట్టకున్నా, మీ పేరుమీద పార్సిల్ వచ్చింది అంటూ, క్యాన్సిల్ చేయాలంటే ఓటీపీ చెప్పాలంటూ అడిగి, వారి ఖాతాలలోని డబ్బులు నిముషాల్లో మాయం చేస్తున్నారు. సైబర్ నేరాల పట్ల అవగాహన లేకపోవటం, సైబర్ నేరగాళ్ళ కొత్త ఎత్తుగడలు తెలియకపోవటంతో నిత్యం అనేకమంది మోసపోతున్నారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు ఇటీవల ఎక్కువగా నమోదు అవుతున్నాయి.

మొబైల్ కు ఓటీపీ .. చెప్తే క్షణాల్లో డబ్బు మాయం .. జాగ్రత్త అంటున్న సైబర్ పోలీసులు

స్మార్ట్ ఫోన్ లకు మాల్ వేర్లను పంపించి, ఫోన్లను హ్యాక్ చేయడం, ఫోన్ కాల్స్ చేసిన వారితో మాట్లాడుతూ వారి వివరాలను సేకరించి, ఆపై ఓటీపీ లను పంపించి, వాటి ద్వారా వారి ఖాతాల నుండి డబ్బులు కొల్లగొట్టడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే ఇటువంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి ఓటిపి అడిగితే చెప్పొద్దని సూచిస్తున్నారు. ఒకవేళ అలా చెప్తే మోసగాళ్లు సైబర్ నేరాలకు ఓటీపీ లను ఉపయోగించే అవకాశం ఉందని తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు.

English summary
Cybercriminals are committing new types of cyber fraud by asking the OTP to cancel the order, even though the customer has not placed any parcel order. If the OTP says by customers, the money is being emptied from their accounts by cyber criminals..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X