మంత్రి కేటీఆర్ ఎవరా..? గతంలో షర్మిల చేసిన కామెంట్స్ ట్రోల్
మంత్రి కేటీఆర్.. అందరికీ తెలుసు, ఐటీ శాఖ మంత్రిగా చక్కగా పనిచేస్తున్నారు. అయితే నిన్న వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల.. చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. కేటీఆర్ ఎవరూ అని ఆమె మాట్లాడగా.. నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ తెలియదా అని సెటైర్లు వేస్తున్నారు. ఇక టీఆర్ఎస్, కేటీఆర్ ఫ్యాన్స్ అయితే గతంలో షర్మిల మాట్లాడిన మాటలను గుర్తుచేస్తున్నారు. మంత్రి కేటీఆర్, కేటీఆర్ అంటూ షర్మిల చేసిన ప్రసంగాలను షేర్ చేశారు.

వీడియోలు షేర్..
కేటీఆర్ ఫ్యాన్స్ వీడియోలను షేర్ చేశారు. ఎన్నికల సమయం, ఇతర ప్రెస్ మీట్‌లలో షర్మిల కేటీఆర్ అని ప్రసంగించారు. అప్పుడు గుర్తు ఉన్న రామన్న.. ఇప్పుడు యాది లేడా అని అడుగుతున్నారు. కానీ కొత్తగా కేటీఆర్ ఎవరూ అని కామెంట్ చేయడం సరికాదని అంటున్నారు. ఆ సమయంలో కేటీఆర్ మీకు గుర్తులేదా అని అడిగారు. ఐటీ శాఖ మంత్రిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేయడం లేదా అని అడిగారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి.. ప్రధాన పార్టీ కీలక నేత ఎవరో మీకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు.

అప్పుడు గుర్తున్నారా..?
కేటీఆర్ ఎవరో తెలియనిదే ఇదివరకు కామెంట్ చేశారా అని నిలదీశారు. అప్పుడు గుర్తు ఉన్న రామన్న.. ఇప్పుడు ఎందుకు మరిచావు షర్మిలమ్మ అని వారి వాదన. పార్టీ ఏర్పాటు చేస్తే నేతలనే మరచిపోతారా అని అడుగుతున్నారు. రేపు, మాపు సీఎంను కూడా గుర్తుకు ఉండరు కావచ్చు అని సందేహం వ్యక్తం చేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి.. కానీ ఇంతలోనే నేతలను మరవడం భావ్యం కాదు.. అవమానించేలా మాట్లాడటం కూడా సరికాదని అంటున్నారు.
Recommended Video

సోషల్ మీడియా షేక్
కేటీఆర్ ఎవరో తెలియదు అని షర్మిల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ప్రతీ ఒక్కరు ట్రోల్ చేస్తున్నారు. టీఆర్ఎస్ ఫ్యాన్సే కాకుండా.. తెలంగాణ వాదులు కూడా ఒకింత ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. షర్మిల తీరు సరిగా లేదని అంటున్నారు. వైఖరి మార్చుకోవాలని సజెస్ట్ చేస్తున్నారు. పార్టీ ఏర్పాటు చేసి.. జనంలోకి వెళ్లాలే తప్ప.. అహంకారంతో మాట్లాడటం మంచి పద్దతి కాదని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications