హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2 రోజుల జైలు శిక్ష.. ఆ యువతికి కోర్టు తీర్పు.. కారణమిదే..?

|
Google Oneindia TeluguNews

పెండింగ్ చలానా ఆఫర్ పూర్తయ్యింది. ఈ ఆఫర్ చాలా మంది యూజ్ చేసుకున్నారు. అప్పటికీ ఫైన్ కట్టనివారి తాటను పోలీసులు తీస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల తాట తీస్తున్నారు. ఉల్లంఘనలపై చార్జ్ షీట్ నమోదు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన యువతికి నాంపల్లి మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ రెండు రోజుల జైలు శిక్ష వేశారు. జరిమానాతోపాటు డ్రైవింగ్ లెసెన్స్ శాశ్వతంగా రద్దు చేసింది.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 80 మంది వాహనదారులకు జరిమానా విధించింది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, ఓవర్ స్పీడ్, మైనర్ డ్రైవింగ్, రేసింగ్/స్టంట్ లు, నంబర్ ప్లేట్ లేని ఉల్లంఘనలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేస్తారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో రూ.600 కోట్ల పైచిలుకు పెండింగ్ చలాన్లు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. పెండింగ్ చలాన్లు క్లియర్ చేసేందుకు పోలీస్ శాఖ అధికారులు కొత్త ప్రతిపాదన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

girl get two days sentence

మార్చి 1వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో పెండింగ్ ఉన్న చలాన్లను చెల్లిస్తే డిస్కౌంట్ ఇచ్చా. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 2 వీలర్ వాహనదారులు పెండింగ్ చలాన్‌లో 25 శాతం చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. మిగతా 75 శాతాన్ని అధికారులు మాఫీ చేశారు. కార్లకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 30 శాతం, తోపుడు బండ్లకు 20 శాతంగా చెల్లింపునకు అవకాశం ఇచ్చారు. చెల్లింపు విధానాన్ని ఆన్‌లైన్, మీసేవా, ఆన్‌లైన్ గేట్‌వేల ద్వారా చేసుకొనే అవకాశం ఇచ్చారు.

మార్చి 31తో ముగియనుండగా మరో గుడ్ న్యూస్ వినిపించారు. మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ ప్రకటించారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు రాయితీ అవకాశాన్ని పొడిగించినట్లు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. చార్జీ షీట్ ఫైల్ చేసి.. కోర్టులో హాజరుపరుస్తున్నారు.

English summary
a girl get two days sentence in hyderabad city
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X