మద్యం మత్తులో డ్రైవింగ్... యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ బీభత్సం... ఒకరికి తీవ్ర గాయాలు...

యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ బీభత్సం సృష్టించాడు. జూబ్లీహిల్స్ సమీపంలో మూడు వాహనాలను ఢీకొట్టాడు. ఇందులో ఓ ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. యాక్సిడెంట్ చేశాక షణ్ముఖ్ కారు ఆపకుండా పారిపోయేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.

షణ్ముఖ్‌కి బ్రీత్ ఎనలైజర్‌తో టెస్టు చేయగా రీడింగ్ 170 చూపించింది. దీంతో పోలీసులే షాక్ తిన్నారు. అతిగా మద్యం సేవించిన అతన్ని అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గాయపడ్డ వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. షణ్ముఖ్‌పై డ్రంకన్ డ్రైవ్‌తో పాటు యాక్సిడెంట్ కేసు నమోదు చేశారు. కారును సీజ్ చేశారు. అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది.

hyderabad drunk youtuber shanmukh jaswanth hits three vehicles in jubileehills

షణ్ముఖ్ యూట్యూబ్‌లో వెబ్‌సిరీస్‌లతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. సాఫ్ట్‌వేర్ డెవలపర్,సూర్య వంటి వెబ్ సిరీస్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇలా మద్యం మత్తులో అతను యాక్సిడెంట్ చేయడం పట్ల చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా,గతంలోనూ పలువురు సెలబ్రిటీలు ఇలా మద్యం మత్తులో పట్టుబడిన సంగతి తెలిసిందే.

hyderabad drunk youtuber shanmukh jaswanth hits three vehicles in jubileehills
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+