యువతి స్నానం చేస్తుండగా.. వెంటిలేటర్ నుంచి తొంగి చూసి.. హైదరాబాద్‌లో అటెండర్ వక్రబుద్ధి
హైదరాబాద్ : యువత చెడు మార్గంలో పయనిస్తోందనడానికి నిత్యం వెలుగుచూస్తున్న ఘటనలే నిదర్శనం. అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులు మొదలు యువతులపై అత్యాచారాల దాకా.. కొందరు యువకులు విచక్షణ కోల్పోతున్నారనే విషయం అర్థమవుతోంది. సమాజంలో ఉంటున్నామనే విషయం మరచిపోయి వికృత చేష్టలకు పాల్పడుతుండటం అనర్థాలకు దారితీస్తోంది. మంచి కంటే చెడు వైపు ఆకర్షితులవుతూ తమ జీవితాలు పాడు చేసుకోవడమే గాకుండా తల్లిదండ్రుల పరువు బజారున పడేస్తున్నారు.
ఇరుగు పొరుగుతో ఎలా ఉండాలోననే ఇంగీత జ్ఞానం మరిచిపోయిన ఓ యువకుడు దారి తప్పాడు. పక్కింట్లో ఉండే యువతి స్నానం చేస్తుండగా వెంటిలేటర్ నుంచి తొంగి చూశాడు. సదరు యువతి ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మలక్‌పేట పరిధిలోని మూసారంబాగ్ డివిజన్‌లోని ఓ అపార్టుమెంట్‌లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా చర్చానీయాంశమైంది.

అపార్టుమెంటులోని మూడో అంతస్తులో ఓ కుటుంబం నివసిస్తోంది. బాలానగర్ ఏరియాలోని ఫతే నగర్ కు చెందిన 37 సంవత్సరాల శివకుమార్ పిళ్లై అనే యువకుడు అదే ఫ్లోర్‌లోని ఓ ఫ్లాట్‌లో ఉంటున్నాడు. అటెండర్‌గా పనిచేస్తున్న శివకుమార్ పిళ్లై ఈ నెల 26వ తేదీన పక్కింటి యువతి బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా వెంటిలేటర్ నుంచి తొంగి చూశాడు.
ఆకస్మాత్తుగా ఆమె దృష్టి వెంటిలేటర్ వైపు మళ్లడంతో విషయం బయటపడింది. షాక్‌కు గురైన ఆ యువతి కేకలు వేయడంతో శివకుమార్ పరారయ్యాడు. కేసు ఫైల్ చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవి ఫుటేజ్ పరిశీలించడంతో నిందితుడి లీలలు వెలుగుచూశాయి. స్టూల్ వేసుకుని బాత్‌రూమ్‌లోకి తొంగి చూసినట్లుగా విజువల్స్ రికార్డయ్యాయి. ఆ మేరకు అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications