తెలంగాణ చరిత్రలో తొలిసారిగా అత్యధిక విద్యుత్ డిమాండ్: కారణాలు

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజు రోజుకు మరింతగా పెరుగుతోంది. తాజాగా, తెలంగాణ చరిత్రలోనే విద్యుత్ డిమాండ్ అత్యధికంగా రికార్డుస్థాయిలో శనివారం నమోదైంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజు రోజుకు మరింతగా పెరుగుతోంది. తాజాగా, తెలంగాణ చరిత్రలోనే విద్యుత్ డిమాండ్ అత్యధికంగా రికార్డుస్థాయిలో శనివారం నమోదైంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఏకంగా 14,649 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైనట్లు విద్యుత్ శాఖ వెల్లడించింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతగా విద్యుత్ వినియోగం నమోదు కావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. కాగా, శుక్రవారం 14,169 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదు కాగా, తాజాగా, శనివారం అంతకుమించి 14,649 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

In the first time fo telangana history, state electricity demand was at a record level of 14649 megawatts

విద్యుత్ వినియోగంలో దక్షిణ భారతదేశంలో రెండోస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో పంటలకు వినియోగించే నీటి స్థాయి పెరిగిందని, ఉద్యాన పంటలకు కూడా నీటి వినియోగం ఎక్కువగా పెరిగిపోయింది. రాష్ట్రంలో ఎక్కువగా బోరుబావులపై ఆధారపడే వ్యవసాయ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ వినియోగం భారీగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇంతకుముందు వ్యవసాయానికి 35 శాతం మాత్రమే విద్యుత్ వినియోగించేవారని.. కానీ, ఇప్పుడు అది 37 శాతానికి పెరిగిందని అధికారులు పేర్కొన్నారు. అంతేగాక, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. కాగా, ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ వినియోగం 6666 మెగావాట్లు మాత్రమే ఉండేదని తెలిపారు. రానున్నది వేసవి కాలం కావడంతో విద్యుత్ వినియోగం మరింత పెరగనుందని.. 15వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. డిమాండ్ పెరిగినప్పటికీ విద్యుత్ అంతరాయం లేకుండా అందిస్తామని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+