మామిడి ప్రియులకు చేదువార్త: ఈ సీజన్ మామిడి.. మహా ప్రియం; ఎందుకంటే!!

పండ్లలో రారాజు అయిన మామిడి పండు ఈసారి షాక్ ఇవ్వబోతుంది. మామిడి ధరలు విపరీతంగా పెరుగుతాయని, మామిడి మహా ప్రియంగా మారుతుందని తాజా పరిస్థితులు చెబుతున్నాయి. ఈ సంవత్సరం వేసవి సీజన్లో మామిడిపండ్ల ధరలు మోత మోగిపోతాయని ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలతో అర్థమవుతుంది.

సంవత్సరం అంతా ఎదురు చూసి, ఎంతో కష్టపడి మామిడి పంటను పండించిన మామిడి సాగు చేసిన రైతులు మరికొద్ది రోజుల్లో పంట చేతికి వస్తుందని భావిస్తే, ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాల దెబ్బకు అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. విపరీతమైన ఈదురుగాలులు, వడగళ్ల వానతో మామిడికాయలు, పిందెలు, పూత రాలిపోవడం మామిడి రైతన్నను భారీగా దెబ్బ కొట్టింది. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా మామిడి రైతులు కుదేలయ్యారు. దీంతోపాటు ఈసారి మామిడి పంటకు తెగుళ్లు, కాత ఎక్కువగా లేకపోవడం వంటి కారణాలు కూడా ఈసారి మామిడి ధరలు విపరీతంగా పెరుగుతాయి అని ఇప్పటి నుంచే సంకేతాలు ఇస్తున్నాయి.

mangoes prices will increase heavily in this summer.. this is the reason!!

తక్కువ దిగుబడి కారణంగా, డిమాండ్ కు తగ్గట్టుగా మామిడికాయల సప్లై ఉండదని, దీంతో ధరలు పెరుగుతాయని ఇప్పటికే వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మామిడిలో ఎక్కువ భాగం గల్ఫ్ దేశాలకు, చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఎగుమతి అవుతుంది. అయితే ఈసారి అకాల వర్షాల కారణంగా ఎగుమతులు కూడా బాగా తగ్గుతాయని భావిస్తున్నారు. ఎప్పుడైనా మామిడి పంట పుష్కలంగా ఉన్న సమయంలో, బాగా పండ్ల దిగుబడి వచ్చిన సమయంలో, మార్కెట్లకు భారీగా పండ్లు వచ్చిన సమయంలో ధరలు తక్కువగా ఉంటాయి.

mangoes prices will increase heavily in this summer.. this is the reason!!

సరిగ్గా కాత లేని సమయంలో, ప్రకృతి విపత్తులతో మామిడి పంట నష్టపోయిన సమయంలో, దిగుబడి సరిగ్గా లేని పరిస్థితులలో ధరలు ఎక్కువగా ఉండడం సహజమే. ఇక ఈ క్రమంలోనే ఈ సంవత్సరం మామిడి పండ్లు వాసన చూసి కడుపు నింపుకోవాల్సిందేనని, విపరీతంగా ధరలు ఉండనున్న నేపథ్యంలో మామిడిపండ్లను కొనుగోలు చేయలేమని పలువురు భావిస్తున్నారు. ఏది ఏమైనా మామిడిపండ్ల సీజన్ వస్తుంది. ఇష్టమైన పండ్లను ఎంచక్కా లాగించొచ్చు అనుకున్న మామిడి ప్రియులకు అకాల వర్షాలు, ఈదురు గాలుల ఎఫెక్ట్ తో మామిడి ధరలు పెరుగుతుండడం ఒకింత చేదు వార్త అని చెప్పాలి.

mangoes prices will increase heavily in this summer.. this is the reason!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+