మైనర్‌పై గ్యాంగ్ రేప్, ఒకరు అరెస్ట్, పరారీలో ఇద్దరు..
ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా.. శిక్షలు అమలు చేస్తోన్న మృగాళ్లు మాత్రం ఆగడం లేదు. అవును రోజు ఎక్కడో ఓ చోట లైంగికదాడులు జరుగుతూనే ఉన్నాయి. అందులో మైనర్లు బాధితులు కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో కూడా ఇలాంటి ఘటన ఒక్కటి జరిగింది. ముగ్గురు యువకులు లైంగికదాడికి తెగబడ్డారు. బాధితురాలు తొమ్మిదో తరగతి విద్యార్థిని.. అయినా ఆమె ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మైనర్ బాలికపై లైంగికదాడి జరిగింది. ముగ్గురు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఆ బాలిక పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుల వేటలో ఉన్నారు. ఇప్పటివరకు ఒకరినీ అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టింది.నిందితులపై పోక్సో కింద కేసు నమోదు చేశారు. కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు అంటున్నారు.

ఇటీవల లైంగిక దాడుల కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. సోషల్ మీడియా ప్రభావమో.. ఏమో కానీ పిల్లలను కూడా వదలడం లేదు. సామూహిక అత్యాచారాలు జరుగుతున్నాయి. అయితే కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. మరిన్ని అలా మరుగున పడిపోతున్నాయి. దీంతో వారు రెచ్చిపోతున్నారు. బాధితులు తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. నిందితులపై యాక్షన్ తీసుకుంటామని చెబుతున్నారు. చివరికీ లైంగికదాడికి గురయిన మైనర్లకు కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నామని వివరించారు.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా












Click it and Unblock the Notifications