Information:హైదరాబాద్ టూ బ్యాంకాక్‌ నాన్‌స్టాప్ ఫ్లయిట్,పూర్తి వివరాలు తెలుసుకోండి..!

హైదరాబాదు నుంచి బ్యాంకాక్‌కు నాన్‌స్టాప్ విమాన సర్వీసులను ప్రముఖ థాయ్‌ ఎయిర్‌లైన్స్ సంస్థ నాక్ ఎయిర్ ప్రారంభించింది.

హైదరాబాద్ : బ్యాంకాక్‌కు (Bangkok) వెళ్లాలనే వారికి గుడ్ న్యూస్. ఇక మన హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్‌కు నాన్‌స్టాప్ ఫ్లయిట్ వచ్చేసింది. థాయ్‌లాండ్‌కు చెందిన ప్రముఖ విమానాయాన సంస్థ నాక్ ఎయిర్ (Nok Air) తమ విమానాలను హైదరాబాద్ (Hyderabad)నుంచి బ్యాంకాక్‌కు తిరిగి బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు నడుపుతోంది. ఈ విమానాలు నాన్‌స్టాప్ సర్వీసులు కాబట్టి ప్రయాణికులు చాలా కంఫర్ట్‌గా గమ్యస్థానం చేరుకోవచ్చు. ఫిబ్రవరి 22వ తేదీన తొలి విమానం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్‌కు తొలి విమానం చేరింది.

వారానికి మూడు సర్వీసులు

వారానికి మూడు సర్వీసులు

భ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వారానికి మూడు సర్వీసులు నడపనున్నట్లు నాక్ ఎయిర్ సంస్థ తెలిపింది. ఈ విమానాలు బ్యాంకాక్‌లోని డాన్ మియాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకుంటాయి. వేసవి కాలంలో విమానాల సంఖ్యను నాలుగు సర్వీసులకు పెంచనున్నట్లు నాక్ ఎయిర్ విమానాయాన సంస్థ తెలిపింది. ఇక కొత్త రూట్లలో విమానాలు తిరుగుతుండటంతో బ్యాంకాక్‌కు వెళ్లడం మరింత సులభతరమవుతుంది.

బ్యాంకాక్‌కు బోయింగ్ 737-800 విమానం

బ్యాంకాక్‌కు బోయింగ్ 737-800 విమానం

హైదరాబాద్ - బ్యాంకాక్‌ రూట్లో ఆపరేషన్స్‌లో భాగంగా ప్రసిద్ధి గాంచిన బోయింగ్ 737-800 ఎయిర్ క్రాఫ్ట్‌ను వినియోగిస్తారు. ఇందులో 189 ఎకానమీ సీట్లు ఉంటాయి. ప్రస్తుతం భారతదేశంలో ఒక్క హైదరాబాద్ నగరం నుంచే నాక్ ఎయిర్ సంస్థ తమ సర్వీసులను నడుపుతోంది. బ్యాంకాక్‌కు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లయిట్ వేయడంతో అక్కడికి వెళ్లేవారి సంఖ్య కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. పర్యాటక నగరాల్లో బ్యాంకాక్ అగ్రస్థానంలో నిలుస్తుంది. అక్కడి సంస్కృతి, ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

భారత్ -థాయ్‌లాండ్ మధ్య బంధం

భారత్ -థాయ్‌లాండ్ మధ్య బంధం

నాక్ ఎయిర్ విమానాయాన సంస్థ తీసుకున్న ఈ చొరవతో భారత్-థాయ్‌లాండ్ దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక బంధాలు మరింత బలోపేతం కానున్నాయి. నాక్ ఎయిర్ వియానాయాన సంస్థ తక్కువ ధరకే తమ విమానాలను నడుపుతుందన్న ముద్ర వేసుకుంది. 2004లో ప్రారంభమైన ఈ సేవలు థాయ్‌లాండ్‌లోనే అధిక సర్వీసులను నడుపుతోంది. అంతకుముందు భారత్‌లోని గౌహతికి బ్యాంకాక్‌కు విమాన సర్వీసులు ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల నిలిపివేసింది. థాయ్‌లాండ్, చైనా, భారత్, జపాన్, లావోస్, మియన్మార్, వియత్నాంలకు విమాన సర్వీసులను నడుపుతోంది. అయితే భారత్‌లో మాత్రం ఒక్క హైదరాబాద్‌కే తన సర్వీసులను పరిమితం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+