తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు: వాయుగుండగంగా అల్పపీడనం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దిగువ స్థాయిలోని గాలులు దక్షిణ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నాయని పేర్కొంది.

శనివారం ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో అండమాన్ సముద్రంలో కొనసాగుతూ.. సగటు సముద్ర మట్టం నుంచి మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయి వరకు ఉందని తెలిపింది. దీని ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

 Heavy rains in telangana district for next three days

ఇది ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లోని ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లోని అండమాన్ సముంద్రంలో మే 9వ తేదీన వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత దాదాపు ఉత్తరం దిశగా పయనిస్తూ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లోని అండమాన్ సముద్రం వైపునకు కదులుతూ తీవ్ర తుపానుగా బలపేడ అవకాశం ఉందని వెల్లడించింది.

అల్పపీడనంగా మారిన తర్వాత ఈ తుపాను దిశ, వేగం, వేగం, తీవ్రత, ప్రయాణించే మార్గం తెలుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని 9వ తేదీ నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దాదాపు 40-43 డిగ్రీల వరకు పెరిగే అవకాశం కూడా ఉందని పేర్కొంది. ఇక హైదరాబాద్ నగర పరిసరాల్లో సుమారు 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. కాగా, ఇప్పటికే కురిసన వర్షాలతో భారీగా పంట నష్టం జరగ్గా.. మళ్లీ వర్షాలంటే రైతులు ఆందోళన చెందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+