హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేవంత్ రెడ్డికి షాక్: భూ ఆక్రమణలు నిజమేనని తేల్చిన అధికారులు, క్రిమినల్ కేసు..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి భూ ఆక్రమణల విషయంలో ఎదురుదెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి భూ అక్రమాలపై రెవెన్యూ అధికారులు విచారణ పూర్తి చేశారు. అంతేగాక, గోపన్‌పల్లిలోని సర్వే నెంబర్ 127లో రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డిలు అక్రమంగా భూ మ్యుటేషన్, కబ్జాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.

నాపై కేసులు..ప్రభుత్వ పట్టాలే: వెనుకడుగే లేదన్న రేవంత్, కేసీఆర్, కేటీఆర్ రాజీనామాకు డిమాండ్ నాపై కేసులు..ప్రభుత్వ పట్టాలే: వెనుకడుగే లేదన్న రేవంత్, కేసీఆర్, కేటీఆర్ రాజీనామాకు డిమాండ్

రేవంత్ భూ ఆక్రమణలు నిజమే..

రేవంత్ భూ ఆక్రమణలు నిజమే..

ఈ భూ ఆక్రమణలపై ఇప్పటికే రేవంత్ రెడ్డిపై ఆరోపణలున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన అధికారులు ఆక్రమణలు నిజమేనని తేల్చారు. రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉన్న 10.20 ఎకరాల భూమి ఆక్రమించిందని రెవెన్యూ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. దీంతోపాటు సర్వే నెంబర్ 127లోనే మరో 5.5 ఎకరాలకు టైటిల్ లేనట్లుగా గుర్తించారు. ఈ మేరకు రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ దీనిపై పూర్తి నివేదికను మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు.

రేవంత్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ..

రేవంత్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ..

ఈ నివేదికలో ఆర్డీవో చంద్ర కళ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఎకరం 36 గుంటల భూమిని అక్రమంగా మ్యుటేషన్ చేయించుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, ఓల్టా చట్టాన్ని ఉల్లంఘించినందుకుక రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆర్డీవో తన నివేదికలో సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించిన గోడలను కూడా కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

స్థానికుల ఆరోపణల ఆధారంగా.. మళ్లీ దర్యాప్తు చేపట్టిన సర్కారు

స్థానికుల ఆరోపణల ఆధారంగా.. మళ్లీ దర్యాప్తు చేపట్టిన సర్కారు

కాగా, గోపన్‌పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 127లో ఉన్న భూమిలో కొంత భాగాన్ని రేవంత్ రెడ్డి ఆక్రమించారని స్థానికులు గతంలోనే ఆరోపించారు. ఈ భూమిని ఓ వ్యక్తి నుంచి కొన్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించారని కొందరు, తమ పేరిట మ్యుటేషన్ చేసేందుకు డబ్బులిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ఇవ్వలేదని మరికొందరు ఆరోపించడం గమనార్హం. స్థానికులు కొందరు ఈ వ్యవహారంపై హైకోర్టును కూడా ఆశ్రయించారు. అనంతరం ఈ వ్యవహారంపై విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్.. తప్పుడు పత్రాలు సృష్టించి, ఈ భూమి మ్యుటేషన్ జరిగిందని నిర్ధారించి సీఎస్‌కు నివేదిక ఇచ్చారు. తప్పుగా రికార్డుల్లో నమోదు చేశారని, తప్పుడు మ్యుటేషన్లు చేశారని కలెక్టర్ ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గోపన్‌పల్లి భూ వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్న ఆరపణలపై ప్రత్యేక అధికారితో విచారణ జరిపించాలని ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం నిర్ణయించింది. ఈ క్రమంలోనే దర్యాప్తు జరిపిన ఆర్డీవో చంద్రకళ మంగళవారం తన విచారణ నివేదికను కలెక్టర్‌కు అందజేశారు.

Recommended Video

Revanth Reddy : SI ఫిర్యాదుతో రేవంత్ పై నాన్ బెయిలబుల్ కేసు || Oneindia Telugu
ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టుకు రేవంత్..

ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టుకు రేవంత్..

ఇది ఇలా ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో నిందితుడైన రేవంత్ రెడ్డి మంగళవారం ఏసీబీ కోర్టు ముందు హాజరయ్యారు. 2015లో ఓటుకు నోటు కేసులో అరెస్టైన రేవంత్ రెడ్డి కొన్ని నెలలపాటు జైలులో ఉన్న విషయం తెలిసిందే. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌కు రూ. 50 లక్షలు ఇస్తుండగా రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. ఈ కేసులో ఏ1గా రేవంత్ రెడ్డితోపాటు పలువురుపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న రేవంత్ తోపాటు నిందితులంతా కోర్టుకు హాజరయ్యారు. వాదనలు విన్న కోర్టు ఈ కేసు తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది.

English summary
rajendranagar rdo submit report revanth reddy's illegal lands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X