చిరంజీవి అడవిదొంగ సినిమా చూపిస్తూ గాంధీ ఆస్పత్రి వైద్యుల అరుదైన సర్జరీ
హైదరాబాద్: హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి వైద్యులు ఓ అరుదైన శస్త్ర చికిత్సను చేసి ఘనత సాధించారు. ఓ యాభై ఏళ్ళ మహిళకు ట్యాబ్ లో చిరంజీవి నటించిన అడవి దొంగ సినిమా చూపిస్తూ, ఆమెతో మాట్లాడుతూ రెండు గంటల పాటు సర్జరీ చేసి అరుదైన రికార్డును సృష్టించారు.

రోగి స్పృహలో ఉండగా సినిమా చూపిస్తూ మెదడులోని కణితిని తొలగించిన వైద్యులు
రోగి స్పృహలో ఉండగానే మెదడులోని కణితిని న్యూరో సర్జరీ విభాగం, అనస్తీషియా విభాగం వైద్యులు కలిసి విజయవంతంగా తొలగించారు. రోగి స్పృహలో ఉండగా ఆమెతో మాట్లాడుతూ చిరంజీవి నటించిన అడవి దొంగ సినిమా చూపిస్తూ, ఆ సినిమా గురించి ఆమెతో మాట్లాడుతూ రెండు గంటల పాటు చేసిన ఈ సర్జరీ సక్సెస్ అయిందని వైద్యులు సంతోషం వ్యక్తం చేశారు.

సర్జరీ నిర్వహించటానికి రెండు గంటలపాటు టీమ్ ఆఫ్ డాక్టర్ల కష్టం
ఇక ఈ శస్త్రచికిత్సను న్యూరో సర్జరీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ప్రకాష్ రావు ఆధ్వర్యంలో, డాక్టర్ ప్రతాప్ కుమార్, డాక్టర్ నాగరాజు అనస్తీషియా విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ సారయ్య, డాక్టర్ అబ్బయ్య, డాక్టర్ ప్రతీక్ష, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వైద్యులు డాక్టర్ కిరణ్, డాక్టర్ గిరీష్, డాక్టర్ స్పూర్తి, డాక్టర్ యామిని తదితరులు నిర్వహించారు. వీరంతా రెండు గంటల పాటు ఆపరేషన్ కోసం కష్టపడ్డారు.

ఆపరేషన్ సక్సెస్ కావటంతో వైద్యుల సంతోషం
ఆపరేషన్
విజయవంతం
కావడంతో
వైద్యులు
సంతోషం
వ్యక్తం
చేశారు.
ఇక
ఈ
శస్త్రచికిత్సను
వైద్యపరిభాషలో
అవేక్
క్రానియోటమీ
అంటారని
వైద్యులు
చెబుతున్నారు.
స్మార్ట్‌ఫోన్‌లో
సినిమా
చూస్తూ
ఆపరేషన్
చేయించుకున్న
మహిళ
కూడా
వైద్యులకు
బాగా
సహకరించారని
గాంధీ
ఆస్పత్రి
వైద్యులు
చెబుతున్నారు.
మనిషి
చేతనంగా
ఉన్న
సమయంలో
నిర్వహించే
అరుదైన
మెదడు
శస్త్రచికిత్స
ఇది
అని
వైద్యులు
చెబుతున్నారు.
ఇది
మెలకువగా
మరియు
అప్రమత్తంగా
ఉన్నప్పుడు
మెదడుపై
చేసే
ఒక
రకమైన
ప్రక్రియ
అని
చెబుతున్నారు.

ఇటీవల తొలిసారిగా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసిన ఈఎన్టీ వైద్యులు
ఇదిలా
ఉంటే
ఇటీవల
గాంధీ
ఆస్పత్రి
వైద్యులు
తొలిసారిగా
కాక్లియర్
ఇంప్లాంట్
సర్జరీ
చేశారు.
ఈఎన్టీ
విభాగాధిపతి
డాక్టర్
శోభన్
బాబు
నేతృత్వంలోని
సర్జన్ల
బృందం
శస్త్ర
చికిత్స
చేసింది.
మూడేళ్ల
చిన్నారి
వినికిడి
లోపాన్ని
సరిచేయడానికి
ఈ
శస్త్ర
చికిత్స
నిర్వహించారు.
వినికిడిని
మెరుగుపరచడానికి
చెవిలో
ఎలక్ట్రానిక్
పరికరాన్ని
అమర్చడం
కోసం
నిర్వహించిన
సుదీర్ఘమైన
శస్త్ర
చికిత్స
ఇది.
గాంధీ
ఆసుపత్రిలో
ఇంత
వరకు
కాక్లియర్
ఇంప్లాంట్
చేయలేదని,
ఇది
ఖరీదైన
మరియు
సుదీర్ఘమైన
ప్రక్రియ
అని,
ప్రైవేట్
ఆసుపత్రులలో
సుమారు
రూ.
15
లక్షలు
ఖర్చవుతుందని
వైద్యులు
తెలిపారు.
గాంధీ
ఆసుపత్రిలో
ఆరోగ్యశ్రీ
పథకం
కింద
ఉచితంగా
ఈ
శస్త్రచికిత్సను
నిర్వహించారు.
వైద్య
ఆరోగ్య
శాఖ
మంత్రి
హరీశ్‌రావు
కూడా
ఓ
ట్వీట్‌లో
వైద్యులను
అభినందించారు.