హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓ శ్రావణి కథ..అజ్ఞాతం వీడని అశోక్ రెడ్డి.. మొబైల్ స్విచాఫ్, కాల్ డేటా ఆధారంగా..

|
Google Oneindia TeluguNews

టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఏ-2 అశోక్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శ్రావణి కేసులో విచారణకు సోమవారం హాజరవుతానని పోలీసులకు చెప్పారు. కానీ హాజరుకాక పోగా.. మొబైల్ స్విచాఫ్ చేశారు. దీంతో ఆయన ఆచూకీ కనుగొనే పనుల్లో పోలీసులు నిమగ్నమయ్యారు. అతను ఎక్కడ ఉన్నాడో ఆరా తీసే పనుల్లో పోలీసులు బిజీగా ఉన్నారు. శ్రావణి ఆత్మహత్య కేసులో ఏ-1 సాయి, ఏ-3 దేవరాజ్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఓ శ్రావణి కథ.. ఆమె చావుకు వారిద్దరే కారణం..? అసలేం జరిగిందంటే..?ఓ శ్రావణి కథ.. ఆమె చావుకు వారిద్దరే కారణం..? అసలేం జరిగిందంటే..?

విచారణకు డుమ్మా.. మొబైల్ స్విచాఫ్..

విచారణకు డుమ్మా.. మొబైల్ స్విచాఫ్..

అశోక్ రెడ్డి విచారణకు హాజరుకాలేదు. దీంతో ఫోన్ చేస్తే మొబైల్ స్విచాఫ్ వస్తోంది. దీంతో ఆయన కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎవరితో మాట్లాడారు..? ఎక్కడ ఉండే అవకాశం ఉండే అంశాన్ని అంచనా వేస్తున్నారు. ఆయన మాట్లాడిన వివరాల ఆధారంగా.. లోకేషన్ ట్రేస్ చేసే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి సినిమాల్లో అవకాశాల పేరుతో శ్రావణితో అశోక్‌రెడ్డి దగ్గరయినట్టు పోలీసులు గుర్తించారు. కానీ మధ్యలో దేవరాజ్ రావడంతో.. అశోక్ రెడ్డి తట్టుకోలేకపోయాడని తెలుస్తోంది.

 కీ రోల్..?

కీ రోల్..?

సాయికృష్ణ ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి వారు విడిపోయేలా చేశాడని సమాచారం. ఈ నెల 7న అమీర్‌పేటలో ఓ హోటల్ వద్ద శ్రావణి, దేవరాజ్‌తో గొడవ అనంతరం సాయికృష్ణ ఆమెను ఇంటికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఇంటివద్ద శ్రావణిపై దాడిచేశారని సమాచారం. ఆత్మహత్యకు ముందురోజు జరిగిన వ్యవహారంలో అశోక్‌రెడ్డి కీలకపాత్ర పోషించినట్టు పోలీసులు ఆధారాలు సేకరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

సినిమాల్లో నటించేందుకు వచ్చి..

సినిమాల్లో నటించేందుకు వచ్చి..

కాకినాడ సమీపంలోని గొల్లప్రోలుకు చెందిన శ్రావణి.. సినిమాల్లో నటించాలనే కోరికతో ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చారు. అప్పుడు తన ఫ్రెండ్ ద్వారా సాయికృష్ణా రెడ్డి పరిచయం అయ్యాడు. ఇండస్ట్రీలో తనకున్న పరిచయాలతో అశోక్ రెడ్డిని పరిచయం చేశాడు. ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమాలో శ్రావణికి చిన్న రోల్ కూడా ఇప్పించారు. అలా శ్రావణితో సాయి పరిచయం కొనసాగింది. తర్వాత ఆమెకు టీవీ సీరియల్స్ అవకాశం రావడం, ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో ఆమె పేరంట్స్, బ్రదర్ కూడా హైదరాబాద్ వచ్చారు. అయితే వారితో కూడా సాయికి పరిచయం ఏర్పడటంతో.. క్రమంగా ఇంటికి కూడా వచ్చేవాడు.

దేవరాజ్ పరిచయంతో..

దేవరాజ్ పరిచయంతో..

గతేడాది టిక్ టాక్ ద్వారా శ్రావణికి దేవరాజ్ పరిచయం అయ్యాడు. అయితే వారి ప్రాంతం కావడంతో.. శ్రావణి అతనితో చనువుగా ఉంటేంది. కొద్దిరోజులు ఆమె ఇంట్లో కూడా ఆశ్రయం కల్పించింది. వీరిద్దరూ క్లోజ్‌గా ఉండటం.. సాయికి నచ్చలేదు. గొడవ పోలీసు స్టేషన్ వరకు చేరడంతో.. దేవరాజ్ శ్రావణి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కానీ వారిద్దరూ తరచూ కలుసుకునేవారు. ఆ రోజు సాయి, ఫ్యామిలీ మెంబర్స్ తనను వేధిచారని, దాడి చేశారని శ్రావణి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆడియోలో ఆధారంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

English summary
sravani suicide case: producer ashok reddy absconding in monday onwards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X