అందం..ఆహ్లాదం..ఆకర్షణీయం..!ట్యాంక్ బండ్ పునర్నిర్మాణం ఓ అద్బుత దృశ్యం.!
హైదరాబాద్ : హైదరాబాద్ నగరానికి గుండె లాంటి ట్యాంక్ బండ్ కొత్త సొబగులను అల్లుకుంటోంది. సుందర మనోహర దృశ్యాన్ని తలపిస్తూ పర్యాటకుల చేత ఔరా అనిపించుకోబోతోంది. ఒక పక్క హుస్సేన్ సాగర్ నీటి గలగలలు, మరోపక్క నెక్లెస్ రోడ్ ప్రకృతి నుండి వచ్చే చల్లని రమణీయ గాలులతో ట్యాంక్ బండ్ పరిసరాలు ఆహ్లాదాన్ని పంచనున్నాయి. ట్యాంక్ బండ్ అందాలకు మెరుగులు అద్దాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు తగ్గట్టే పునర్నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, అందంగా తీర్చిదిద్దుతోంది.

అద్బుత దృశ్యం ట్యాంక్ బండ్ ప్రదేశం.. మరింత సుందరీకరిస్తున్న టీ సర్కార్..
హైదరాబాద్ నగరానికి ఓ విశిష్టమైన చరిత్ర ఉంది. నగరంలో ఉండే చల్లని వాతావరణం భారతదేశంలో ఎక్కడా ఉండదనే నానుడి కూడా దేశ ప్రజల్లో ఉంది. ఉరుకులు పరుగులతో నిత్యం యాంత్రిక జీవనం గడిపే వారికి హుస్సేన్ సాగర్ పరిసరాలు ముఖ్యంగా ట్యాంక్ బండ్ ప్రదేశం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాంటి ట్యాంక్ బండ్ ను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కార్ ప్రణాళికలు రచించింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు తగట్టు ట్యాంక్ బండ్ ను సుందరీకరిస్తున్నారు అధికారులు.

శరవేగంగా ట్యాంక్ బండ్ రెనోవేషన్.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచనున్న ట్యాంక్ బండ్..
విశాలమైన ట్యాంక్ బండ్ రోడ్డుకు ఇరువైపుల అత్యంత సుందరంగా అలంకరిస్తున్నారు. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ లో నీళ్లు, బుద్దుడు కనిపించే వైపు మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు హైదరాబాద్ మెట్రో డెవెలప్ మెంట్ అధికారులు. ఫుట్‌పాత్‌పై గ్రానైట్, ఇనుముతో చేసిన రేలింగ్, గ్రిల్స్, డిజైనర్ విద్యుత్ దీపాలను అమర్చుతున్నారు. మరింత ఆకర్షణీయంగా ఉండేందుకు వీలుగా ఫర్నీచర్, కియోస్క్‌లతో పాటు అలంకార దీపాలను అమర్చారు. పర్యాటకులను ఆకట్టుకునేలా ట్యాంక్‌బండ్‌కు ఇరువైపులా సుందరీకరణ పనులను వేగంగా చేపడుతున్నారు.

కొత్త లుక్ సంతరించుకోనున్న ట్యాంక్ బండ్.. ఆకట్టుకోనున్న విద్యుత్ దీపాలు..
అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశంగా గుర్తించబడ్డ ట్యాంక్‌బండ్‌కు మరిన్ని పర్యాటక హంగులు తేవాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. అందులో భాగంగా మొదటగా హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న ఫుత్‌పాత్‌లతో పాటు ఇతర అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపాదికన చేపట్టింది హెచ్ఎండీఏ. ట్యాంక్ బండ్ సుందరీకరణకు సుమారు 60 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో హెచ్ఎండీఏ అధికారులు పనులు చేపట్టారు. సందర్శకులు సేద తీరేలా పెవిలియన్స్, బెంచీలను ఏర్పాటు చేస్తున్నారు. రంగు రంగుల పూలు, అలంకరణ మొక్కలను నాటుతున్నారు.

యాంత్రిక జీవనంలో ఉపశమనం.. ఆహ్లాదం పంచనున్న ట్యాంక్ బండ్..
హైదరాబాద్ బ్రాండ్ ను రెట్టింపు చేసేలా ఉన్న ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో సుందరీకరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అందమైన దీపాలు, పాదాచారుల దారులను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతున్నారు. సాధ్యమైనంత త్వరలోనే వీటిని నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హెచ్ఎండీఏ అధికారులు యోచిస్తున్నారు. జంట నగరాల మధ్యలో అందరికి అందుబాటులో ఉండడంతో నగరవాసులు సాయంకాల వేళ కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ సేదతీరుతూ, ఆహ్లాదంగా గడపడం ఆనవాయితీగా వస్తోంది. సుందరీకరణ పనులు తర్వాత ట్యాంక్ బండ్ ఎంతో మంది పర్యాటకులను ఆకర్షించబోతుంది.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications