Dr.BR Ambedkar: రేపే అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ.. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షాలు..
ఏప్రిల్ 14 డా.బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ లో ఆవిష్కరించనున్నారు. ట్యాంక్ బండ్ సమీపంలో 125 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం సీఎం కేసీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
ఈ సందర్భంగా రేపు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షాలు విధించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 8 గంటలకు నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్, లక్డీకపూల్, తెలుగుతల్లి జంక్షన్ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షాలు విధిస్తారు.

ఏదైనా అత్యవసరం అయితే ట్రాఫిక్ కంట్రోల్ హెల్ప్ లైన్ నంబర్ 9010203626 కి ఫోన్ చేయాలని పోలీసులు కోరారు. శుక్రవారం ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్ , లుంబీనీ పార్కులు మూసివేయనున్నారు. నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ , తెలుగు తల్లి జంక్షన్ వైపు వాహనాలకు అనుమతించారు.
ట్యాంక్ బండ్ ,బీఆర్కే భవన్ ,తెలుగు తల్లి జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ వైపు వెళ్లే వాహనాలు లక్డీకాపూల్ వైపు పంపుతారు. లక్డీకపూల్ నుంచి ట్యాంక్ బండ్ ,లిబర్టీ వైపు వెళ్లే వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్, లోయర్ ట్యాంకు బండ్ వైపు మళ్లిస్తారు.
The 125-foot-tall statue of Dr. B. R. #Ambedkar statue is all set for inauguration on the stalwart's birth anniversary, April 14, 2023.
— Telangana Digital Media Wing (@DigitalMediaTS) April 13, 2023
It is erected on the banks of Hussain Sagar & near upcoming new #Telangana State #secretariat named after Dr. Ambedkar.#JaiBhim #JaiTelangana pic.twitter.com/mfOXm56UEB
పంజాగుట్ట, సోమాజీగూడ, ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోడ్డు వైపు వెళ్లే వాహనాలను షాదన్ కాలేజ్ మీదుగా వెళ్లాలి. సంజీవయ్య పార్క్, నెక్లెస్ రోడ్డు నుంచి ఎన్టీఆర్ మార్కగ్, ఖైరతాబాద్ వైపు వెళ్లే వాహనాలు రాణిగంజ్ వైపు మళ్లిస్తారు. అంబేడ్కర్ విగ్రహం డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications