Hyderabad: ఆదివారం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షాలు.. ఎందుకంటే..!
ఏప్రిల్ 30న జరగనున్న తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవాన్ని దృష్టి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షాలు విధించనున్నారు. ఆదివారం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. హుస్సేన్ సాగర్,సైఫాబాద్, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించనున్నారు. ఎన్టీఆర్ గార్డెన్స్, ఎన్టీఆర్ ఘాట్, లుంబనీ పార్క్, నెక్లెస్ రోడ్డును పూర్తిగా మూసి వేస్తున్నట్టు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు చెప్పారు.
వీఐపీల రాకపోకలను బట్టి పీవీ విగ్రహం, నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ వరకు ఇరువైపుల అప్పటి పరిస్థితులను బట్టి ట్రాఫిక్‌ను నిలిపివేయడం, మళ్లింపులు చేస్తామని పేర్కొన్నారు. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ నుంచి ట్రాఫిక్‌కు అనుమతి లేదన్నారు. ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి, బీఆర్‌కే భవన్ నుంచి ఎన్‌టీఆర్ మార్గ్ రూట్‌లో వాహనాలకు ఎంట్రీ లేదని తెలిపారు. ఆర్టీసీ బస్సులు లోయర్ ట్యాంక్‌బండ్,కవాడిగూడ మీదుగా మళ్లిస్తున్నట్టు చెప్పారు. ఆహ్వానితుల కోసం పార్కింగ్ స్థలాలు కేటాయించామని, సచివాలయానికి వచ్చే ఆహ్వానితులు తమ పాస్‌లను కార్లకు అతికించుకోవాలని సూచించారు.

అఫ్జల్‌గంజ్ నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే బస్సులు ట్యాంక్ బండ్ రహదారిని తప్పించి తెలుగు తల్లి ఫ్లైఓవర్, కట్ట మైసమ్మ, లోయర్ ట్యాంక్ బండ్, డిబిఆర్ మిల్స్, కవాడిగూడ మీదుగా వెళ్లాలి. పీవీ విగ్రహం (ఖైరతాబాద్) జంక్షన్, పాత సైఫాబాద్ పిఎస్ జంక్షన్, రవీంద్ర భారతి జంక్షన్, మింట్ కాంపౌండ్ రోడ్, తెలుగు తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట జంక్షన్, కట్ట మైసమ్మ (లోయర్ ట్యాంక్ బండ్), ట్యాంక్ బండ్, లిబర్టీ చుట్టూ ఉన్న ట్రాఫిక్ ఆంక్షాలు విధించనున్నారు.

ప్రజలు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ @హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫేస్‌బుక్ పేజీలో, @HYDP ట్విట్టర్‌లో ట్రాఫిక్ అప్‌డేట్‌లను అనుసరించాలని సూచించారు. అటు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) శుక్రవారం నుంచి మే 28, 2023 వరకు 30 రోజుల పాటు పనులు చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించనున్నారు. ఈ క్రమంలో రద్దీని నివారించడానికి తగిన ప్రత్యామ్నాయ రహదారులను ఉపయోగించాలని ప్రయాణికులకు ట్రాఫిక్ పోలీసులు సూచించారు.












Click it and Unblock the Notifications