హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెబల్ స్టార్: ప్రభుత్వ తీరును తప్పుపట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

|
Google Oneindia TeluguNews

స్వపక్షంలో ధిక్కార స్వరం వినిపించే నేతలు కొందరే.. ఏపీలో అయితే రఘురామ హాట్ టాపిక్ అవుతారు. ఇక తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. కేసీఆర్‌ను ఎదురించి మాట్లాడే నేత లేరు. ముందు కాదు.. వెనకాల కూడా ఆ ధైర్యం చేయరు. దాంతోపాటు గులాబీ దళానికి కావాల్సినంద మెజార్టీ ఉంది. ఇదీ ప్లస్ పాయింట్ కానుంది. అయితే రేగా కాంతా రావు ధైర్యం చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.

 విమర్శలు

విమర్శలు

అసెంబ్లీ సాక్షిగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రభుత్వ పనితీరును తప్పుపట్టారు. సోమవారం అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలు ఉన్నచోటే ప్రభుత్వం నిధులను ఖర్చుచేస్తోందని మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం, అసిఫాబాద్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలకు ప్రభుత్వం సరైన నిధులను మంజూరు చేయడంలేదని అన్నారు. హుజురాబాద్ బై పోల్.. ఇతర చోట్ల ఎన్నిక ఉంటేనే నిధులు మంజూరు అవుతున్నాయని కామెంట్ చేశారు. వాస్తవానికి ఇదీ నిజం కూడా.

డెవలప్ లేదు

డెవలప్ లేదు

పినపాక నియోజక వర్గంలో ఎన్నికలు లేకపోవడంతో అక్కడి అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతాలను కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తన ప్రశ్నలకు పురపాలక శాఖా మాత్యులు కేటీఆర్‌ సమాధానం చెప్పాలని కోరారు. మంత్రి సమాధానం చెప్పాల్సి ఉంది. రేగా కాంతారావు కామెంట్స్ కలవరం రేపాయి. దీనిపై అధికార పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలీ మరీ.

హుజురాబాద్

హుజురాబాద్

ఇటు హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబర్ 8వరకు నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13గా ప్రకటించారు. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల నిర్వహిస్తారు. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటిస్తారు.

Recommended Video

కేంద్ర రాష్ట్ర విదానాలపై మండి పడ్డి ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్!
 కంపల్సరీ

కంపల్సరీ

హుజురాబాద్‌లో విజయం టీఆర్ఎస్- బీజేపీకి తప్పనిసరి. గెలుపు కోసం ఆ రెండు పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అధికార పార్టీకి విజయం కంపల్సరీ.. లేదంటే మొహం చూపించుకునే పరిస్థితి ఉండదు. ఇక బీజేపీ పరిస్థితి అయితే మరీ దారుణం.. పార్టీకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మాత్రం జీవన్మరణ సమస్యే.. ఎందుకంటే ఆయన ఓడిపోతే రాజకీయంగా కోలుకోలేని దెబ్బ.. ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరీ హుజురాబాద్ ప్రజలు ఏం తీర్పు చెప్పనున్నారో చూడాల్సిందే.

English summary
trs mla rega kanta rao oppose government rules and regulations in the state
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X