Hyderabad: మెట్రో ప్రయాణికులకు అలర్ట్.. ఆ స్టేషన్లు మూసివేత..

హైదరాబాద్ లో మెట్రోతో చాలా వరకు ట్రాఫిక్ తగ్గిపోయింది. రోడ్డుపై ఇబ్బంది పడే బదులు చాలా మంది మెట్రోలో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే మెట్రో ప్రయాణికులకు ఓ అలర్ట్ ప్రకటించింది మెట్రో సంస్థ. నగరంలోని రెండు మెట్రో స్టేషన్లను రెండు గంటలకు పైగా మూసివేయనున్నట్లు ప్రకటించించింది. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించనున్నారు. భద్రత కారణాల దృష్ట్యా రెండు స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించింది.

సోమవారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి.. ఆరు గంటల 30 నిమిషాల వరకు చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను మూసివేయనున్నారు. ఆ రూట్లలో ప్రయాణించే వారు ఇది గమనించాలని మెట్రో ప్రయాణికులకు సూచించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రోడ్ షో సాయింత్రం 5 గంటలకు ముషీరాబాద్ లో ప్రారంభం కానుంది. ఆ తర్వాత రోడ్ షో సనత్‌నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మలక్‌పేట్, యాకత్‌పురా, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, ఎల్‌బీ నగర్, మహేశ్వరం, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, మేడ్చల్, అంబర్‌పేట్, ఖైరతాబాద్, నాంపల్లి, కార్వాన్, శేర్లింగంపల్లి, చార్మినార్, రాజేంద్రనగర్, గోషామహల్‌ వరకు సాగి అక్కడే ముగుస్తుంది.

Two metro stations will be closed for two hours during Narendra Modis road show

దీంతో ఆయా ప్రాంతాల్లో ఉండే మెట్రో స్టేషన్లు 15 నిమిషాల పాటు మూసివేయనున్ననట్లు మెట్రో పేర్కొంది. ఆ రూట్లలో ప్రయాణించే ప్రయాణికులు తమ ప్రయాణాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకుని మెట్రో సూచించింది. మోడీ రోడ్ షోతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఈ రోడ్ షో సందర్భంగా మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ తెలిపారు.

బేగంపేట విమానాశ్రయం నుంచి కాచిగూడ ఎక్స్ రోడ్స్ మీదుగా ఎయిర్‌పోర్ట్ వై జంక్షన్, పీఎన్ టీ ఫ్లై ఓవర్ కింద కుడి మలుపు, షాపర్స్ స్టాప్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట్ ఫ్లై ఓవర్, గ్రీన్ ల్యాండ్స్, అమీర్‌పేట్, పంజాగుట్ట, రాజీవ్ గాంధీ విగ్రహం/మోనప్ప ఐలాండ్ జంక్షన్, యశోద హాస్పిటల్, ఎంఎంటీఎస్, రాజ్ భవన్, వివి స్టాచ్యు, నిరంకారి, పాత పీఎస్ సైఫాబాద్, ఇక్బాల్ మినార్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, ఇందిరా రోటరీ (నెక్లెస్ రోటరీ), ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి, కట్ట మైసమ్మ, ఇందిరాపార్క్, అశోక్‌నగర్, ఆర్టీసీ ఎక్స్ రోడ్లు, చిక్కడపల్లి, నారాయణగూడ మరియు కాచిగూడ ఎక్స్ రోడ్ మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+