హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హెల్మెట్ పెట్టుకుంటారో లేకా లైసెన్స్ పోగొట్టుకుంటారో మీ ఇష్టం .. స్వీట్ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్లో ట్రాఫిక్ రూల్స్ ను మరింత కఠినతరం చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఫైన్లు వేయడమే కాదు, ఏకంగా లైసెన్స్ ని రద్దు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో ట్రాఫిక్ రూల్స్ ను కఠినంగా అమలు చేస్తుండగా, తాజాగా కేంద్ర మార్గదర్శకాలతో అటు ఫైన్ ల బాదుడు మాత్రమే కాదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏకంగా లైసెన్స్ లను కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

కేంద్రం మార్గదర్శకాలతో కఠినమైన ట్రాఫిక్ రూల్స్ అమలు

కేంద్రం మార్గదర్శకాలతో కఠినమైన ట్రాఫిక్ రూల్స్ అమలు

2019 సెప్టెంబర్ 1 నుండి కొత్త మోటార్ వాహన చట్టం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. పాత మోటార్ వెహికల్ చట్టానికి కేంద్రం మార్పులు చేసి గతంలోనే మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం క్షేత్రస్థాయిలో నిబంధనలు అమలు కావడం లేదు . ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం రహదారి భద్రత విషయంలో కేంద్ర మోటారు వాహన నిబంధనలు 1989 నోటిఫికేషన్‌లోని వివిధ సవరణలకు సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.

కఠినంగా ట్రాఫిక్ రూల్స్ అమలు చేస్తున్న సైబరాబాద్ పోలీసులు

కఠినంగా ట్రాఫిక్ రూల్స్ అమలు చేస్తున్న సైబరాబాద్ పోలీసులు

ఈ చట్టంలోని సవరణల ప్రకారం మెరుగైన పర్యవేక్షణ కోసం మోటార్ వెహికల్ రూల్ అమలు, వాహన పత్రాల నిర్వహణ మరియు ఇ-చలాన్లపై దృష్టి సారించింది. కొత్త నిబంధనలు 2020 అక్టోబర్ 1 నుండి అమలు చేయబడతాయని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలను జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా రాష్ట్రాలు కేంద్రం ఆదేశాల మేరకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. హైదరాబాద్ లోని సైబరాబాద్ పోలీసులు కూడా ఇప్పటికే ట్రాఫిక్ రూల్స్ ను కఠినంగా అమలు చేస్తున్నారు.

 హెల్మెట్ లేకుండా ఒకసారి మూడు నెలల పాటు లైసెన్స్ సస్పెండ్ .. రెండో సారి దొరికితే లైఫ్ లాంగ్ రద్దు

హెల్మెట్ లేకుండా ఒకసారి మూడు నెలల పాటు లైసెన్స్ సస్పెండ్ .. రెండో సారి దొరికితే లైఫ్ లాంగ్ రద్దు

హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఇంతకుముందు ఫైన్స్ వేసి వదిలి పెట్టేవారు. కానీ ఇకనుండి మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ పై సస్పెన్షన్ విధిస్తారు.రెండోసారి హెల్మెట్ లేకుండా పట్టుబడితేలైసెన్స్ ను జీవితకాలం రద్దు చేస్తారు. ఇక అదే కనుక జరిగితే జీవితాంతం వెహికల్ డ్రైవ్ చేసే అవకాశమే ఉండదు. ఇప్పటికే ఈ రూల్స్ ను అమలు చేస్తున్నారు . రాంగ్ సైడ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ , ట్రిపుల్ రైడింగ్ , ఓవర్ స్పీడ్ ,సిగ్నల్ జంపింగ్ లకు ఈ నిబంధనలు వర్తిస్తాయని అంటున్నారు.

హెల్మెట్ పెట్టుకోండి ... ట్రాఫిక్ పోలీసుల , రవాణా శాఖాధికారుల స్వీట్ వార్నింగ్

హెల్మెట్ పెట్టుకోండి ... ట్రాఫిక్ పోలీసుల , రవాణా శాఖాధికారుల స్వీట్ వార్నింగ్

ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని , సురక్షితంగా డ్రైవింగ్ చేస్తేనే సేఫ్ గా ఇంటికి వెళ్తారని చెప్తున్నారు. ఒకవేళ అలా కాకుంటే అనవసరపు రిస్కు చేయాల్సి వస్తుందని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. జీవితకాలం డ్రైవింగ్ లైసెన్స్ కోల్పోతే ఇక ఏ వెహికల్ నడప లేరని వార్నింగ్ ఇస్తున్నారు. మీరు సేఫ్ గా ఇంటికి వెళ్లాలన్నా , డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకోకుండా ఉండాలన్న హెల్మెట్ పెట్టుకోండి అంటూ స్వీట్ గా వార్నింగ్ ఇస్తున్నారు.

English summary
In Hyderabad, driving without a helmet was previously subject to fines. But the driver's license will be suspended for three months from now. If caught a second time without a helmet, the license will be revoked for life. . These rules are already being enforced. The rules apply to wrong side driving, rash driving, triple riding, overspeeding and signal jumping.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X