హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ షర్మిల దీక్ష భగ్నం.. పాదయాత్ర చేస్తుండగా అరెస్ట్, స్పృహ తప్పడంతో..

|
Google Oneindia TeluguNews

ఉద్యోగుల సమస్య పరిష్కరించాలని, నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వాలని వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. 72 గంటల దీక్ష చేస్తానని షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. అర్ధాంతరంగా పోలీసులు షర్మిల దీక్షను భగ్నం చేశారు. అంతకుముందు వైఎస్ షర్మిల స్పృహతప్పి పడిపోయారు.

Recommended Video

YS Sharmila Arrest షర్మిల దీక్ష భగ్నం.. పాదయాత్ర చేస్తుండగా స్పృహతప్పి YS Jagan రంగంలోకి దిగుతారా ?
దీక్ష భగ్నం.. షర్మిల అరెస్ట్

దీక్ష భగ్నం.. షర్మిల అరెస్ట్

ఇందిరా పార్క్ నుంచి లోటస్ పాండ్ వరకు తలపెట్టిన షర్మిల పాదయాత్ర భగ్నమైంది. ఇందిరా పార్క్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. అయినా కూడా ఆమె పాదయాత్ర కొనసాగించేందుకు యత్నించారు. పోలీసుల దురుసుగా ప్రవర్తించారు. ఒక దశలో స్పృహతప్పి పడిపోయారు. తేరుకున్నాక షర్మిలను అరెస్ట్ చేసి బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 తోపులాట జరగడంతో..

తోపులాట జరగడంతో..

ఇందిరా పార్క్ నుంచి లోటస్ పాండ్ వరకు పాదయాత్ర చేపట్టారు. షర్మిల పాదయాత్రను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఆమెకు మద్దతు ఇచ్చేందుకు వచ్చిన అభిమానుల మధ్య తోపులాట జరిగింది. ఆ సమయంలో షర్మిల స్పృహతప్పి పడిపోయారు. షర్మిల తేరుకున్నాక పాదయాత్ర కొనసాగింది. తర్వాత షర్మిల దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

72 గంటలా.. నో

72 గంటలా.. నో

దీక్షకు 72 గంటల సమయం కావాలని షర్మిల కోరారు. కానీ ప్రభుత్వం మాత్రం ఒక్కరోజే అనుమతి ఇచ్చింది. దీక్ష విరమించాలని పోలీసులు కోరారు. అయినా దీక్ష కొనసాగించడంతో.. బలవంతంగా లాక్కెళ్లారు. ఇందిరా పార్క్ వద్ద దీక్ష భగ్నం చేసిన తర్వాత లోటస్ పాండ్ నడచి వెల్లేందుకు షర్మిల ప్రయత్నించారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీద పోలీసులు అడ్డుకున్నారు. తాను 72 గంటల దీక్ష చేస్తానని షర్మిల చెప్పారు. తనను ఎక్కడికి తీసుకెళ్లినా పాదయాత్రగా వచ్చి దీక్ష చేస్తానని షర్మిల స్పష్టం చేశారు.

1.91 లక్షల ఉద్యోగాల భర్తీ

1.91 లక్షల ఉద్యోగాల భర్తీ


తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయాలనే డిమాండ్‌తో ధర్నాచౌక్‌లో వైఎస్ షర్మిల దీక్ష చేపట్టారు. ఆమెకు ప్రజా సంఘాలు, మేధావుల నుంచి మద్దతు లభించింది. రచయిత కంచె ఐలయ్య కూడా మద్దతు పలికారు.

రాజకీయ దుమారం

రాజకీయ దుమారం

తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రాజకీయ దుమారం రేగింది. షర్మిల పార్టీ హాట్ టాపిక్ అయ్యింది. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం షర్మిలపై కౌంటర్ అటాక్ చేస్తోంది. తెలంగాణలో మరో పార్టీకి అవకాశం లేదని చెబుతున్నారు. కానీ ప్రజల పక్షాన పోరాడేందుకు ఒక పార్టీ అవసరం అని షర్మిల చెబుతున్నారు. ఆమె పార్టీలో ఒక్కో నేత చేరుతున్నారు.

English summary
ys sharmila arrested move to begumpet police station
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X