ఆస్ట్రేలియా జట్టులో గందరగోళం: ఆ ఫాస్ట్ బౌలర్ దూరం: ఎప్పుడొస్తాడో తెలియదు: టీమిండియాకు ఊపిరి

సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారత క్రికెట్ జట్టుతో రెండో టీ20 మ్యాచ్ ఆడటానికి కొన్ని గంటల ముందు సంభవించిన ఈ నాటకీయ పరిణామాలు భారత జట్టుకు ఊపిరి పోసినట్టయింది. వన్డే సిరీస్‌ను కోల్పోయిన దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అనువైన వాతావరణం కల్పించినట్టయింది. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇంకొన్ని గంటల్లో రెండో టీ20 మ్యాచ్ ఆరంభం కాబోతోంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను గెలిచిన టీమిండియా.. సమరోత్సాహంతో బరిలోకి దిగబోతోంండగా.. ప్రత్యర్థి జట్టులో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

మిచెల్ స్టార్క్ దూరం

మిచెల్ స్టార్క్ దూరం

ఆస్ట్రేలియా బౌలింగ్ వెన్నెముక మిఛెల్ స్టార్క్.. జట్టుకు దూరం అయ్యాడు. మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లల్లో అతను ఆడట్లేదు. రాత్రికి రాత్రి ఈ పరిణమాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం స్టార్క్ జట్లుతో పాటు లేడు. జట్టుతో పాటు సిడ్నీకి చేరుకోలేదు. చివరి వన్డే, తొలి టీ20 మ్యాచ్‌కు వేదికైన క్యాన్‌బెర్రా నుంచి భారత్ ఆస్ట్రేలియా జట్లు సిడ్నీకి వచ్చినప్పటికీ.. స్టార్క్ రాలేదు. ఈ రెండు జట్ల మధ్య టీ20 సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌లు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగనున్నాయి.

వ్యక్తిగత కారణాలతో...

వ్యక్తిగత కారణాలతో...

వ్యక్తగత కారణాల వల్లే మిచెల్ స్టార్క్ సిరిస్ నుంచి తప్పుకొన్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. స్టార్క్ కుటుంబ సభ్యుల్లో ఒకరు తీవ్ర అనారోగ్యానికి గురి కావడం వల్లే అతను ఇంటికి వెళ్లాల్సి వచ్చినట్లు పేర్కొంది. కుటుంబానికి, ఆప్తులకు మించినది ఏదీ, ఎవరికీ ఎక్కువ కాదని, దానికి మిచెల్ స్టార్క్ కూాడా అతీతుడు కాదని ఆస్ట్రేలియా జట్టు హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపారు. స్టార్క్ కుటుంబానికి అతని అవసరం ఉందని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అతను జట్టులోకి మళ్లీ ఎప్పుడు చేరుతాడనేది నిర్ధారించలేమని లాంగర్ స్పష్టం చేశారు.

ఎప్పుడొచ్చినా స్వాగతిస్తాం..

ఎప్పుడొచ్చినా స్వాగతిస్తాం..

కుటుంబం విషయం కావడం వల్ల జట్టులో ఆడాలని తాము స్టార్క్‌పై ఒత్తిడిని తీసుకుని రావట్లేదని లాంగర్ తెలిపారు. జట్టులో పునఃప్రవేశంపై అతనికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు చెప్పారు. అతను ఎప్పుడు జట్టులోకి రావాలనుకుంటే అప్పుడు రావొచ్చని, తాము స్వాగతిస్తామని పేర్కొన్నారు. తాజాగా జస్టిన్ లాంగర చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తోంటే.. టెస్ట్ మ్యాచ్‌లకు కూడా స్టార్క్ ఆడతాడనే గ్యారంటీ కనపించట్లేదు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఈ నెల 17వ తేదీన ప్రారంభం కాబోతోంది. రెండు టీ20లకూ అతను దూరం అయ్యాడని క్రికెట్ ఆస్ట్రేలియా ధృవీకరించింది.

ఇప్పటికే డేవిడ్ వార్నర్ దూరం

ఇప్పటికే డేవిడ్ వార్నర్ దూరం

టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ గాయం వల్ల ఇప్పటికే జట్టుకు దూరం అయ్యాడు. యాష్టన్ అగర్ కూడా ఈ టూర్ మొత్తంలోనూ ఆడేది అనుమానమే. సుదీర్ఘమైన టెస్ట్ మ్యాచ్‌లను ఆడాల్సి ఉన్నందున పాట్ కమ్మిన్స్‌కు విశ్రాంతి కల్పించారు. మార్కస్ స్టోయినిస్ కూడా గాయం వల్ల ఆడట్లేదు. వారికి బదులుగా టీ20 జట్టులోకి డీయార్కీ షార్ట్, మిచెల్ స్వెప్‌సన్, నాథన్ లియాన్‌లను తీసుకున్నారు. తాజాగా స్టార్క్ కూడా జట్టుకు దూరం అయ్యాడు. అతనికి రీప్లేస్‌మెంట్ చేయట్లేదు క్రికెట్ ఆస్ట్రేలియా. ఇప్పటికే జట్టులోకి ఆండ్రూ టై, డేనియల్ సామ్స్‌ను జట్టులోకి తీసుకున్నారు కూడా.

టై లేదా సామ్స్..

టై లేదా సామ్స్..

మిచెల్ స్టార్క్ స్థానంలో రెండో టీ20 మ్యాచ్‌లో ఆండ్రూ టై లేదా సామ్స్‌ను ఆడించే అవకాశం ఉంది. టీమిండియాపై జరిగిన టీ20 లేదా వన్డే ఇంటర్నేషనల్స్ మ్యాచుల్లో వారిలో ఎవరికి అత్యుత్తమ బౌలింగ్ రికార్డులు ఉన్నాయో.. వారిని తుదిజట్టులోకి తీసుకోవచ్చని తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లలో ఆడిన అనుభవం ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని ఆండ్రూ టైకి తుదిజట్టులోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+