వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

11 రోజులు సెలవు.. ఏప్రిల్‌లో తెలుగు రాష్ట్రాల్లో ఇలా, లిస్ట్ ఇదే

|
Google Oneindia TeluguNews

ఈ మధ్య బ్యాంకులకు హాలీడేస్ పెరుగుతున్నాయి. దానికితోడు యూనియన్లు స్ట్రైక్ చేయడం తప్పడం లేదు. సోమవారం, మంగళవారం బ్యాంకు సేవలు కూడా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. సరే ఈ నెల గడిచింది కదా.. మరీ వచ్చేనెల గురించి కూడా అదే ఆందోళన.. అవును ఈ నెలలో అంటే రెండు, మూడురోజులు సెలవు.. కానీ వచ్చేనెలలో ఏకంగా 11 రోజులు సెలవు వచ్చాయి. ఆదివారం, సెకండ్ శాటర్ డే కలుపుకొని వచ్చాయి.. అంటే బ్యాంకులు కేవలం 19 రోజులే పనిచేస్తాయట. సో ఎమర్జెన్సీ ఉన్నవారు. చెక్కులు, డీడీ కట్టేవారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పని కానిచ్చేయాల్సి ఉంటుంది.

బ్యాంకుల‌కు ఒక‌టో,రెండు రోజులో సెల‌వు అయితే ఫ‌ర‌వా లేదు గానీ.. ఏకంగా ఒక నెల‌లోనే స‌గం రోజులు బ్యాంకుల‌కు సెల‌వు వ‌చ్చిందంటే ప‌రిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. అలాంటి ప‌రిస్థితి ఏప్రిల్ నెలలో రానుంది. ఏప్రిల్‌లో బ్యాంకుల‌కు ఏకంగా 15 రోజుల పాటు సెల‌వు రానుంది. దేశంలో ప‌లు రాష్ట్రాల‌ను బ‌ట్టి ఈ సెల‌వుల సంఖ్య‌లో కాస్తంత మార్పు ఉన్నా.. బ్యాంకుల‌కు ఎక్కువ రోజులు సెల‌వు మాత్రం ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 11 రోజుల పాటు ఏప్రిల్ నెల‌లో బ్యాంకులు క్లోజ్ ఉంటాయి. సెల‌వు రోజుల్లో ఆన్ లైన్ బ్యాంకింగ్ అందుబాటులో ఉంటుంది.

 11 days bank holidays in april month

ఏప్రిల్ 1- ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అకౌంట్స్ క్లోజింగ్ డే ఉండనుంది. 2వ తేదీ ఉగాది అయినందున సెలవు.. 3వ తేదీ ఆదివారం సాధారణ సెలవు.. 5వ తేదీ బాబు జగ్జీవన్ రామ్ జయంతి.. 9వ తేదీ రెండో శనివారం సాధారణ సెలవు ఇస్తారు. 10 ఆదివారం సాధారణ సెలవు. 14వ తేదీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి..

15వ తేదీ గుడ్ ఫ్రైడే సెలవు.. 17వ తేదీ ఆదివారం సాధారణ సెలవు. 23వ తేదీ నాలుగో శనివారం సాధారణ సెలవు. 24 ఆదివారం సాధారణ సెలవు ఇస్తారు. ఇలా కలుపుకుంటే.. 11 రోజులు సెలవు ఉండనుంది. అంటే 19 రోజలు బ్యాంకు లావాదేవీలు జరుగుతుంటాయి.

English summary
11 days bank holidays in april month for telugu states. nationwide may be 15 days banks are not working.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X